అంతర్జాతీయం

భారత్‌కు ఎన్‌ఎస్‌జి సభ్యత్వం సంక్లిష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 5: అణు ఇంధన సరఫరా బృందంలో భారత్‌కు సభ్యత్వం రావటం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అత్యంత సంక్లిష్టమైనదని చైనా మరోసారి స్పష్టం చేసింది. ఎన్ ఎస్‌జి లో భారత సభ్యత్వాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న చైనా అణ్వస్త్ర నిరోధ ఒప్పందంపై సంతకం చేయని దేశాల విషయంలో అనుసరిస్తున్న వైఖరే భారత్‌కు కూడా వర్తిస్తుందని మరోసారి పేర్కొంది. ఎన్‌పిటిపై సంతకం చేయని దేశాలకు వివక్షలేని పరిష్కారం ఉండాలని తెలిపింది. 48 దేశాల ఎన్‌ఎస్‌జిలో మెజారిటీ దేశాలు భారత్‌కు సభ్యత్వం ఇవ్వటాన్ని సమర్థిస్తున్నప్పటికీ చైనా మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ‘‘ ఎన్ ఎస్‌జికి సంబంధించి కొత్తగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్‌కు సభ్యత్వం అనేది గతంలో ఊహించిన దానికంటే మరింత సంక్లిష్టంగా మారింది.’’ అని చైనా విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి లి హుయిలై మీడియాకు వివరించారు. ‘‘ ఎన్‌పిటి పై సంతకం చేయని దేశాల వ్యవహారంలో ఏం చేయాలో, సభ్యులందరికీ ఒకేవిధంగా వర్తించేలా, ఎవరి పట్లా వివక్ష లేకుండా ఉండేలా పరిష్కారం చూపడం కోసం ఎన్ ఎస్‌జి చర్చిస్తామంటే చైనా అందుకు సమర్థిస్తుంది’’ అని లీ అన్నారు. పాకిస్తాన్‌ను బహిరంగంగా సమర్థించకపోయినప్పటికీ, పరోక్షంగా ఆయన వ్యాఖ్యలు పాకిస్తాన్ అభ్యర్థిత్వాన్ని సమర్థించినట్లయింది. ఎన్‌పిటి యేతర దేశాల పట్ల చైనా వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ‘చైనా భారత్‌లు ముఖ్యమైన పొరుగుదేశాలు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు. సరికొత్త ఆర్థిక మార్కెట్‌లుగా ఆవిర్భవిస్తున్నవి. శాంతి సుస్థిరతల స్థాపనకు రెండు దేశాలూ చాలా ముఖ్యమైన శక్తులు. ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా బలపడ్డాయి. అధ్యక్షుడు జి జిన్‌పింగ్, ప్రధాని నరేంద్రమోదీల పలు భేటీలు రెండు దేశాల ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించాయి.’’ అని లీ వ్యాఖ్యానించారు.