అంతర్జాతీయం

ప్రతీకార చర్యలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: వాస్తవాధీన రేఖ వద్ద చొరబాట్లను కొనసాగిస్తే అందుకు తగిన ప్రతీకార చర్యలు తప్పవని భారత ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డిజిఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ ఎకె భట్ పాకిస్తాన్ డిజిఎంఓ మేజర్ జనరల్ షాహిర్ శంషాద్ మీర్జాకు స్పష్టం చేశారు. సోమవారం ఇద్దరు డిజిఎం ఓలు ఫోన్‌ద్వారా సంభాషించుకున్నారు. గత కొన్ని నెలల్లో సరిహద్దుల్లో పాకిస్తాన్ వైపునుంచి పెరుగుతున్న చొరబాట్లను గురించి ఇద్దరూ చర్చించుకున్నారు. తమ సంభాషణల సందర్భంగా జనరల్ భట్ ఇటీవలి కాలంలోని కొన్ని సంఘటనలను ఉదాహరణలుగా వివరించినట్లు పేర్కొంది. సామాన్య పౌరులపై కాల్పులు జరుపుతున్నారంటూ పాకిస్తాన్ చేసిన అభియోగాన్ని భారత్ ఖండించిందని వివరించింది.