బిజినెస్

ప్రయోగ దశలో భారత్ బయోటెక్ చికున్‌గున్యా వ్యాక్సిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి పరచిన చికున్‌గున్యా (సిహెచ్‌ఐకెవి) వ్యాక్సిన్ ఫేజ్ 1 హ్యూమన్ క్లీనికల్ ట్రయల్స్ మొదలైనట్లు భారత్ బయోటెక్ సోమవారం తెలిపింది. 60 మంది ఆరోగ్యవంతులపై ముందస్తుగా ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి అధ్యయనం చేస్తున్నామని, దాని ఫలితాలను నమోదు చేసుకుంటున్నామని సంస్థ ఓ పత్రికా ప్రకటనలో తెలియజేసింది. చికున్‌గున్యా అనేది అత్యంత భయానక వైరస్ అని, దీని నిరోధానికి ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ను తీసుకురావాల్సిన అవసరం చాలానే ఉందని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా ఎల్లా అన్నారు. ఫేజ్ 1 క్లీనికల్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నిరుడు అనుమతినిచ్చిందని తెలిపారు.