బిజినెస్

కాగ్‌తో జిఎస్‌టిఎన్ ఆడిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: వస్తు, సేవల పన్ను నెట్‌వర్క్ (జిఎస్‌టిఎన్)ను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) ఆడిట్ చేయనుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం స్పష్టం చేశారు. తమ పార్టీ సహచర సభ్యుడైన సుబ్రమణ్యన్ స్వామి తరచూ జిఎస్‌టిఎన్‌లో భాగస్వామ్య విధానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో జైట్లీ నుంచి తాజా ప్రకటన విడుదలవగా, జిఎస్‌టిఎన్ నిర్మాణం గత యుపిఎ ప్రభుత్వ హయాంలో, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి పి చిదంబరం నిర్ణయంతో జరిగిందన్న జైట్లీ.. తనకు వ్యక్తిగతంగా జిఎస్‌టి నిర్మాణంపై విబేధించడానికి ఒక్క కారణం లేదని సిఎన్‌బిసి టివి18తో చెప్పారు. ఇదిలావుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. నూతన పరోక్ష పన్నుల విధానమైన జిఎస్‌టి అమలు సన్నాహాలను సోమవారం సమీక్షించారు. వచ్చే నెల (జూలై) 1 నుంచి ఈ చారిత్రాత్మక పన్నును కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే జిఎస్‌టి అమలుకు తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలతోపాటు చేపడుతున్న ప్రయత్నాలపై మోదీ ఇక్కడ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో అరుణ్ జైట్లీ, రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సిబిఇసి) సీనియర్ అధికారులు పాల్గొన్నారు. జిఎస్‌టి రేట్లను జిఎస్‌టి కౌన్సిల్ ఖరారు చేసిన తర్వాత మోదీ జరిపిన తొలి సమీక్ష ఇదే. మరోవైపు ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రైవేటీకరణపై తన అభిప్రాయాన్ని మరోసారి సమర్థించుకున్నారు జైట్లీ. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా ప్రైవేటీకరణపట్ల నీతి ఆయోగ్ వైఖరితో వ్యక్తిగతంగా తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునేది మాత్రం కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. విమానయాన మార్కెట్‌లో కేవలం 14 శాతం వాటా కలిగిన ఎయిరిండియాకు ప్రభుత్వం నుంచి మరింత ఆర్థిక సాయం దండగని, ఆ సొమ్ము ఇతరత్రా సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చిస్తే మంచిదని నీతి ఆయోగ్ అభిప్రాయపడినది తెలిసిందే. ఎయిరిండియా రుణ భారం 50,000 కోట్ల రూపాయలకుపైగానే ఉంది. ఇంత రుణాలున్న ఎయిరిండియాను వదిలించుకోవడం ఉత్తమమని జైట్లీ కూడా అంటున్నారు. ఇకపోతే ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం అత్యవసరమని జైట్లీ వ్యాఖ్యానించారు.
ఇటీవలే ఎస్‌బిఐలో దాని ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్‌ను విలీనం చేసినది తెలిసిందే. ఈ క్రమంలో మరిన్ని బ్యాంకుల ఏకీకృతానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎస్‌బిఐసహా 21 ప్రభుత్వరంగ బ్యాంకులున్నాయి. నిరుడు డిసెంబర్ 31 నాటికి వీటి మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) విలువ 6.06 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. బ్యాంకింగ్ రంగాన్ని ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని మొండి బకాయిలు ప్రశ్నార్థకం చేస్తున్నది తెలిసిందే. బ్యాంకులు ఎక్కువగా ఉండటంతో ఒక బ్యాంకులో రుణం తీసుకుని ఎగవేసినవారు మరొక బ్యాంకులో రుణం పొందుతున్నాడని, దీనివల్ల మొండి బకాయిలు ప్రమాదకర స్థాయికి పెరిగిపోయాయన్న అభిప్రాయం కేంద్ర ప్రభుత్వం నుంచి వినిపిస్తున్నది తెలిసిందే. అందుకే బ్యాంకులను ఒక్కటి చేస్తే ఈ సమస్య తగ్గుతుందని అంటోంది. అంతేగాక ప్రభుత్వం నుంచి ధన సాయం కోసం కూడా ఎదురు చూడనక్కర్లేదని జైట్లీ అంటున్నారు. ఈ క్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ తదితర దక్షిణాది ప్రభుత్వరంగ బ్యాంకులను, దక్షిణ ఇండియన్ బ్యాంక్ వంటి కొన్ని పెద్ద బ్యాంకులతో దేనా బ్యాంక్‌ను విలీనం చేసే వీలుందన్న అంచనాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. కాగా, జూలై 1 నుంచి జిఎస్‌టి అమలు కానున్నప్పటికీ 7 రాష్ట్రాలు ఇప్పటికీ స్టేట్ జిఎస్‌టి చట్టాన్ని తమ అసెంబ్లీల్లో ఆమోదించలేదు. వాటిలో మేఘాలయ, పంజాబ్, తమిళనాడు, కేరళ, కర్నాటక, జమ్ముకశ్మీర్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయ. ఇప్పటిదాకా దేశంలోని 24 రాష్ట్రాలు జిఎస్‌టికి ఆమోదముద్ర వేశాయ. వీటిలో కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయ. ఇక జిఎస్‌టిలో బంగారం అమ్మకాలపై 3 శాతం పన్ను విధించిన నేపథ్యంలో బంగారు ఆభరణాల డిమాండ్ దీనివల్ల ఏమాత్రం ప్రభావితం కాబోదని ఐసిఆర్‌ఎ ఓ రిపోర్టులో అభిప్రాయపడింది. ప్రస్తుత రేటు కంటే కాస్త పెరగగా, దానివల్ల ప్రతికూల ప్రభావం పడబోదంది.
అయతే ముడి వజ్రాలపై జిఎస్‌టి పన్నుపట్ల పునఃపరిశీలించాలని మాత్రం రత్నాలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జిజెఇపిసి) ప్రభుత్వాన్ని కోరుతోంది. 0.25 శాతం పన్ను చెల్లించాలని కేం ద్రం ప్రకటించగా, రత్నాలు, ఆభరణాల ఎగుమ తుల వ్యాపారానికి వజ్రాలు కీలక ముడి సరుకు అని, తాజా పన్ను నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ ఆభరణాలు ప్రియం అవుతాయని జిజెఇపిసి చైర్మన్ ప్రవీణ్‌శంకర్ పాండ్య అన్నారు. అయనప్పటికీ బంగారంపై తక్కువగా 3 శాతం పన్నును వేయడాన్ని స్వాగతి స్తున్నట్లు పాండ్య చెప్పారు. మరోవైపు సెల్యులార్ ఆపరేటర్లు.. టెలికామ్ రంగంపై 18 శాతం జిఎస్‌టి రేటును వ్యతిరే కిస్తున్నారు. దీన్ని తగ్గించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొం టున్న టెలికామ్ రంగాన్ని తాజా నిర్ణయం కుదేలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.