సబ్ ఫీచర్

నిద్రలేమితో పెరిగే ఊబకాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పడుకున్న వెంటనే హాయిగా నిద్రపోయేవాళ్ళు అదృష్టవంతులు. అయితే ఆ అదృష్టం అందరికీ వుండదు. మారిన పరిస్థితుల దృష్ట్యా పిల్లలలో కూడా నిద్ర సమస్యగా మారటం ఆశ్చర్యంగానే వుంటుంది.
నిద్ర సరిగా పోనివారిలో ఊబకాయం సమస్య మొదలవుతుంది. కానె్వంటుల్లో, పాఠశాలల్లో భారీకాయాలతో వుండే పిల్లలు కనిపిస్తున్నారు. మితిమీరిన బరువువలన పిల్లలు అందం, ఆకర్షణ కోల్పోతున్నారు.
గతంలో అంటే సుమారు మూడు లేదా నాలుగు దశాబ్దాల క్రితం క్రమశిక్షణ పేరుతో పిల్లలపట్ల కఠినంగా వ్యవహరిస్తూ, వారికి అనేక విషయాలపట్ల అవగాహన పెంపొందించేవారు. కుటుంబ వాతావరణంలో ఇప్పుడా పరిస్థితులే లేవు. పిల్లలకు సరైన ఆహార అలవాట్లు నేర్పాలని, సమయానికి నిద్ర లేపాలని, తిరిగి సమయానికి నిద్రపుచ్చాలని చాలామంది తల్లిదండ్రులలో లేకపోవటం విచారకరం.
దీనికితోడు అతిగారాబం కూడా పిల్లలు పాటించాల్సిన నియమ నిబంధనలు పనికిరాకుండా చేస్తున్నది.
పిల్లలు బాగా బరువు పెరిగితే నిర్లక్ష్యం, బద్ధకం వాయిదాలు వేసే ఆలోచనా ధోరణి, కూర్చొని ఒకేచోటనుండి కదలకపోవడం, తాము చేయాల్సిన పనులను పేరెంట్స్‌కు పురమాయించటం, ఎక్కువసేపు తినే అలవాటు వంటి జాడ్యాలు తయారవుతాయి.
ఈనాటి పిల్లలకు నిద్ర తక్కువే. పేరంట్స్‌తో కలిసి లేదా ఎవరికి వారు రాత్రిళ్ళు నిద్రపోయేవరకూ టీవీ షోలు, వీడియో గేమ్స్, నెట్ చాటింగ్‌ల్లాంటివి చేయడంవలన తగినంత నిద్రపోక శరీరం కణ విభజన అతిగా జరిగిపోయి ఊబకాయాలు వస్తుంటాయి. నిద్ర తగ్గిపోవడంవల్లే పిల్లలు భారీకాయాలతో బాధపడుతున్నారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
అందుకే తల్లిదండ్రులు పిల్లల నిద్ర విషయంలో తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం వుంది. రాత్రిళ్ళు ఎక్కువగా మేల్కొననీయకుండా తగిన క్రమశిక్షణతో తగినంత నిద్రపోయేట్లు చేయగలిగితే పిల్లలలో ఊబకాయం రాకుండా నివారించవచ్చు.

- హిమజా రమణ