డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీ చేతులలో చాలామంది పిల్లలు పుట్టే ఉంటారు కదా!’’
చిరునవ్వుతో అంది ‘‘వేలమంది పుట్టి ఉంటారు’’.
‘‘ఇలాటివో?’’ అన్నాను. ఎందుకో ‘అబార్షన్’ అన్న పదం నాకు ఉచ్చరించబుద్ధి అవలేదు.
‘‘ఇంచుమించు అనేన్నానేమో!’’ అంది.
ఆశ్చర్యంగా చూశాను.
‘‘మీకు ఏమీ తప్పు అనిపించదా?’’ అడిగాను సంకోచిస్తూనే.
ఆవిడ నా అమాయకత్వానికి నవ్వలేదు. నా మనసులో సంఘర్షణ అర్థం అయినట్లే సమాధానం చెప్పింది. ‘‘ఏ పనైనా బాధ్యత అయితే దానికి తప్పొప్పులు ఉంటాయి. కర్తవ్యానికి ఉండవు. నే చేసేదంతా నా వృత్తి కర్తవ్యమే’’ అంది.
ఎందుకో ఆ సమాధానం తృప్తి ఇవ్వలేదు.
‘‘మీకు పాపపుణ్యాలమీద నమ్మకం లేదా’’ అడిగాను సంకోచిస్తూనే అడిగాను.
‘‘లేకేం బోలెడు ఉంది. పాపాయిని పుట్టించినపుడల్లా పుణ్యం చేసుకుంటున్నానని అనుకుంటే, ఒక గర్భంని అబార్షన్ చేసినపుడు పాపం అనుకుంటే- నేను పుణ్యాలే ఎక్కువ చేశాను’’ అంది నవ్వుతూ!
‘‘చూడమ్మా, నేను ఒక ఆడపిల్లకు వైద్యం చేసినపుడు ఇవేవీ నా మనసులోకి రావు. నే చేసే వైద్యం సరిగా జరుగుతోందా లేదా అని తప్ప! నేను పాప పుణ్యాల గురించి ఆలోచిస్తూ చెయ్యవలసిన పనిన ప్రొఫెషనల్‌గా చెయ్యనని నిరాకరిస్తే- మరోదారి లేని ఆడపిల్లలు అడ్డదారుల్లో వెడతారు. ఏ చేతకాని నాటు వైద్యుల దగ్గరకో వెళ్లి ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. ప్రాణంమీదకు తెచ్చుకుంటారు. ఇది తెలిసిన నేను పాపం, పుణ్యం అంటూ బేరీజు ఎలా వెయ్యను? ఒక పుట్టని శిశవుని కాపాడాలా ఒక పెద్ద ప్రాణం కాపాడాలా’’ అంది.
నాకు కావలసిన సమాధానం రాలేదు. ఇంకా పొడిగించదలచుకోలేదు.
‘‘ఇందులో ప్రమాదం లేదా’’ అని అడిగాను.
‘‘ఎందులోనూ ప్రమాదం లేదని ఎవ్వరూ అనలేరు. అయితే స్టాటిస్టికల్‌గా ఫలితం బాగున్నపుడు ప్రమాదం లేదనే చెప్తారు’’ అంది.
‘‘అంటే’’ అన్నాను అర్థంకాక.
‘‘అంటే- ఏవైనా లక్షకో, కోటికో ఒక ప్రమాదం జరిగినపుడు ప్రమాదం లేనట్లే లెక్క వేస్తారు.
‘‘ఆ ఒక్కటే నేను కూడా అవచ్చు కదా’’ అన్నాను. భయం, భయంగా.
ఆవిడ చిరునవ్వుతో లేచింది. నాకు దగ్గరగా వచ్చి భుజం చుట్టూ చేతులు వేసి గట్టిగా నొక్కింది.
‘‘మరీ ఎక్కువగా ఆలోచించకు. ఏ నిర్ణయం తీసుకున్నా త్వరగా తీసుకో. ఆలస్యం చేసినకొద్ది ప్రమాదం పెరుగుతుంది. మానసిక బంధం ఏర్పడకమునుపే- అన్నీ జరిగిపోవాలి. నువ్వు చాలా చిన్న వయసులో ఉన్నావు. మీ ఇద్దరికీ కావలసినంత భవిష్యత్తు ముందు ముందు ఉంది. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడే కనవచ్చు’’’ అంది.
నేను వౌనంగా విన్నాను.
‘‘చూడు, ఇప్పుడయితే చాలా సులువుగా జరిగిపోతుంది. మామూలు మందులతోనే జరిగిపోతుంది. ఏం పెద్ద ప్రొసీజర్ అక్కరలేదు’’ అంది.
ఆ తరువాత చాలాసేపు చాలా విషయాలమీద నడిచింది మా సంభాషణ.
నేను కేవలం ప్రేక్షకురాలిగా ఉండిపోయాను.
‘‘ఇంకేమన్నా అడగాలని ఉందా’’ అని అడిగింది.
లేదని తల ఊగించాను.
‘‘్భయపడకు. ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. రోజుకు వేలమీద జరుగుతున్నాయి’’ అంది.
అటూ ఇటూ కాకుండా తల ఊగించాను. అర్థం అయిందో లేదో కాని.
నా వీపు మీద చేత్తో తట్టి గది బయటకు నడిచింది. బయట ఎదురుచూస్తున్న అత్తగారితో అంది.
‘‘చిన్నతనం కదా! భయపడుతోంది. మరీ ప్రెషర్ తేకండి. కొంచెం స్థిమితంగా ఆలోచించుకోనీయండి’’ అంది.
ఆ సమాధానం మా అత్తగారికి నచ్చింది అని నేను అనుకోను. డాక్టర్‌గారు నాతో మాట్లాడంగానే అన్ని విషయాలు తేలిపోతాయానుకుంది.
కాని డాక్టర్‌గారు చాలా వివరించింది. రెండు పక్కల లాభాలు, నష్టాలు కళ్ళకు చూపింది. కాని నిర్ణయం మాత్రం చేయలేదు. ఏ వైపు పక్షపాతంతో మాట్లాడలేదు. ఆవిడ దృష్టి అంతా నాకు పరిస్థితులు అర్థం కావాలనే!
ఆవిడలో వృత్తిపరమైన నిజాయితీకి చాలా ఇంప్రెస్ అయ్యాను.
నాకోసం ఆవిడ ఏ నిర్ణయమూ చెయ్యలేదు. ఒకవేళ నేను నిర్ణయించుకుంటే మాత్రం ఎక్కువ రోజులు జాప్యం చెయ్యద్దండి.
తక్కిన వారందరి దృష్టిలో ఎలా ఉన్నా ఈసారి ఎందుకో నిర్ణయాలు ఎప్పుడూ అంతా సులువుగా జరగవేమోనని అనిపిస్తోంది. మొట్టమొదటిసారిగా, నాతో మాట్లాడి, నన్నో వ్యక్తిగా పరిగణించి నన్ను ఆలోచించుకో అని చెప్పిన ఆ వ్యక్తిమీద నాకు చాలా గౌరవం పెరిగింది.
అప్పటివరకు గడిచిన నా 18 ఏళ్ళ జీవితంలో అందరు చెప్పినట్లు చేయడం తప్ప, నేనూ, నాకుగా ఆలోచించుకోవడం, నిర్ణయం తీసుకోవడం లాంటి పరిస్థితి రాలేదు. అసలు మిగిలిన వారి ఉద్దేశ్యంలో ఇప్పుడు కూడా ఆ పరిస్థితి లేదు. వాళ్ళందరూ నిర్ణయాలు చేశారు. నేను మామూలుగా తల ఆడించడమో, తటస్థంగా ఉండటమో జరగాలి. కానీ నా మనసు ఎప్పుడూ అంత సుళువుగా ఈసారి వినదేమో.
మామూలుగా లేచి అలవాటుగా కిటికీ దగ్గరకు నడిచాను. క్రింద అత్తగారూ, మామగారు ఇద్దరూ కారు దాకా వెళ్లి డాక్టర్‌గారికి కృతజ్ఞతలు తెలుపుతూ వీడ్కోలు పలుకుతున్నారు. కారు వెళ్లిపోగానే ఇద్దరూ గేటు దగ్గరే ఆగిపోయారు. ఏదో మాట్లాడుతున్నారు.
నన్ను గురించేనని నాకు తెలుసు.
ఆ సాయంత్రమే విజయవాడ బయలుదేరాము. కారు దాకా వచ్చి మామగారు- నాన్నతో అన్నారు.
‘‘ఎక్కువ రోజులు ఆలస్యం చెయ్యొద్దు బావగారు. అది ఆరోగ్యానికి మంచిది కాదు. మీకు మీ ఊళ్ళో ఏదైనా ఇబ్బందికరంగా ఉంటుంది అనుకుంటే ఇక్కడికి వచ్చేయండి. అన్ని ఏర్పాట్లు చేయిస్తాను’’ అన్నారు.
నాన్న తల ఊగించారు. మా మామగారికి నా మొహంలోకి చూడటం ఇష్టంలేకపోయినట్లుంది. నా వంక చూడలేదు. కారు బయలుదేరింది విజయవాడవైపు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి