మంచి మాట

భక్తి సామ్రాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి సామ్రాజ్యానే్నలే చక్రవర్తులు, రారాజులు చాలామంది ఉంటారు. ఈ సామ్రాజ్యాన్ని ఎవరికి వారే కట్టుకోవాలి. ఇక్కడ భగవంతుడే పాలితుడు. పాలకుడు కూడా. ఎందుకంటే భగవంతునిలోని అంశమే నేను అనుకొంటాడు కాని తన్ను భగవంతుని కన్నా వేరుగా భక్తుడు భావించడు.
కనుక ఈ సామ్రాజ్యంలో భగవంతుడు ఒక్కడే ఉంటాడు. నిజానికి ఈ సర్వసృష్టిలో ఉన్నది భగవంతుడొక్కడే. అందులోనూ ఈ భక్తి సామ్రాజ్యంలో అజ్ఞానులైనా సుజ్ఞానులైనా భగవంతుడు, భక్తుడు వేరు వేరు అని భావించేవారు అరుదు. దేవీ దేవతలను పూజించే భక్తులు చాలామంది ఉన్నట్టు భావించినప్పటికీ వీరిలో వీరికి పోటీ వుండదు. వ్యత్యాసమూ వుండదు. ఎవరికి వారు వారి వారి పరిధుల్లో వాళ్లే ఉత్తమోత్తములు.
వారిలో వీరు తక్కువని, ఎక్కువని చెప్పడానికి ఏమీ ఉండదు. మట్టి పిసుక్కును కుమ్మరివాడు సైతం భగవంతుడిని మరెవరూ ప్రేమించలేనంతగా ప్రేమించవచ్చు. అట్లానే ఆ కుమ్మరిపైన భగవంతుడికి అవాజ్యానురాగాలు కలుగవచ్చు. అందుకే ఒకనాడు నారదుడు కలియుగదైవం అయిన వేంకటేశ్వరుడిని అడిగాడట. దానికి ఆయన నాకు ఈ కొండ కింద వున్న కుమ్మరివాడు ఇష్టుడు అన్నాడట. అదేంటి అట్లా అంటావు. ఇక్కడ నీకు ఎన్నో సేవలు చేస్తూ అనుక్షణం నీ అనుగ్రహం కోసం పడిగాపులూ అనునిత్యం నీవు అలంకార ప్రియుడవని చెప్పి రకరకాల అలంకారాలు చేస్తూ రకరకాల నైవేద్యాలకు ఆరగింపు చేస్తూ ఉంటే నీవేమో నిన్ను ఒక్కసారి చూడడానికి రాని ఆ కుమ్మరి వానిపైన నీకు ప్రేమ అంటావేమి అని అడిగాడట.
దానికి విష్ణుమూర్తి నాకు ఎన్ని సేవలు చేసారని, ఎన్ని రకాల నివేదనలు చేశారని నేను చూడను. కాని వారిలో నాపై ఉన్న ప్రేమ ఎంత అని మాత్రమే చూస్తాను అన్నాడట.
అట్లానే ఒకసారి తల్లి దండ్రుల సేవ చేసుకునే పుండరీకాక్షుని పరీక్షించడానికి ద్వారకాపుర వాసి వచ్చాడట. ఆ దేవాదిదేవుడు వచ్చినా తిరగచూడని పుండరీకాక్షుని తల్లిదండ్రుల సేవను ఆ వసుదేవుడు కన్నార్పకుండా చూస్తుడిపోయాడట. అపుడు ఆ పుండరీకాక్షుడు అతనికి దగ్గరలో ఉన్న ఇటుకను ద్వారకాధిపతి దగ్గరకు విసిరి ‘ఇదిగో ఈ ఇటుకపై నిలుబడు నేను నా తల్లిదండ్రుల సేవ ముగించుకుని వస్తాను ’ అన్నాడు. అట్లాంటి పుండరీకాక్షుని కోసం అలాగే ఆగిపోయి పుండరీకాక్షుడు వచ్చిన తరువాత తనవితీరా మాట్లాడాడట. ఆ విషయం నేటికీ తెలియాలనే శ్రీరంగంలో పాండురంగడు నడుముకు చేయి ఆన్చి పుండరీకునికోసం ఎదురుచూస్తున్న భంగిమలోనే కొలువుతీరాడట.
ఎంతటి దయామూర్తో అంతటి కరుణాతరంగుడు ఆ దేవాదిదేవుడు. ఇటువంటి వాడు కనుకనే నాడు మొసలి బిగువులో ఇరుక్కుని పోయి స్వామి రక్షింపవే , కావవే అని ఎలుగెత్తి అరిచిన ఏనుగు రక్షణార్థం వైకుంఠాన్ని వీడి తన అర్థాంగి కి కూడా చెప్పకుండా ఏ రక్షణాయుధాలు చేపట్టకుండా పరుగెత్తుకు వస్తే ఆయుధాలువాటికవే వచ్చి శ్రీమహావిష్ణువు చెంతన నిలిచాయట. స్వామి పరుగులిడే చందాన్ని చూచిన లక్ష్మీదేవి తనకు తనే అడుగులో అడుగువేస్తూ స్వామితో వచ్చి ఏనుగు రక్షణార్థం నిలిచిందట. కరుణామూర్తి రాముడై అయోధ్యాపురిలో ఉన్నాడని అతడే అడవికి వస్తున్నాడని తెలుసుకొన్న శబరి ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురు చూసి చూసి రాముడు రాగానే తానే అడవి అంతా తిరిగి తియ్యని పండ్లు ఏరుకుని వచ్చి వాటిని మరలా తాను తిని రుచి చూసి తర్వాత ఆరామునికి పెట్టిందట. భక్తిమాధుర్యాన్ని చవిచూసిన శబరి కనుకనే రామునికి తీయని పండ్లు పెట్టాలని తెలుసుకొని మరీ పెట్టింది.
అటువంటి వాత్సల్యపూరితుడు, ఆర్థ్రతతో పిలిస్తే పలికేవాడు కనుకనే భగవంతుడి కనుల నీరు చూచిన ఆగలేక తన రెండు కళ్లనూ ఇవ్వడానికి ముందుకు కురికి భక్తకన్నప్పగా మారిపోయాడు ఓభక్తుడు.
భక్తుని కోరిక తీరులాగు భగవంతుడు తన్ను తాను సృజియించుకుంటూ ఉంటే భక్తుడు భగవంతునికి ప్రీతుడు కావడానికి తన్ను తాను మలుచుకుంటూ ఉంటాడు. కనుక ఇక్కడ భగవంతునికి భక్తునికి అభేదం చెప్పారు పెద్దలు. భక్తుని సేవిస్తే భగవంతుని సేవించినట్లే అనడంలో కూడా ఇదే మర్మం దాగి ఉంది. భాగవత సేవ భగవంతుని సేవనే.

- కె. యాదయ్య