పెద్దదిక్కును కోల్పోయాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆయనకు సంతాప సభను బుధవారం ఫిలింనగర్ క్లబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నందిని సిద్ధారెడ్డి, ఎంఎల్‌సి ఫరూక్, ప్రతాని రామకృష్ణగౌడ్, జె.వి.ఆర్, కవిత, జమున, గీతాంజలి, మల్కాపురం శివకుమార్, రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ- దాసరి సినిమా రంగానికి అందించిన సేవలు అనిర్వచనీయం. ఎంతోమందికి సహాయ సహకారాలు అందించారు. మంత్రిగా కూడా పలు సేవా కార్యక్రమాలు చేసిన ఆయన మనమధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ- తెలుగు పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన మరణం తీరని లోటు. దాసరిగారు మరో పదేళ్లపాటు ఉంటే పరిశ్రమకు మరిన్ని మంచి పనులు జరిగేవి. చిన్న నిర్మాతలకు ఆయన అండగా ఉండేవారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు. కోడి రామకృష్ణ మాట్లాడుతూ- అనాథ అనే పదం విన్నాం కాని దాని అర్థం ఈరోజు తెలుస్తోంది. దాసరిగారి మరణం తీవ్ర దుఃఖానికి గురిచేసింది. ఆయన లేని లోటు ఎన్నటికీ భర్తీకాదు అన్నారు.
దాసరికి ఫిలిం క్రిటిక్స్ సంతాపం
దర్శకరత్న దాసరి నారాయణరావు మృతిపట్ల సంతాపాన్ని తెలియజేస్తూ ఫిలిం క్రిటిక్స్ ఆధ్వర్యంలో బుధవారం ఫిలిం చాంబర్ హాల్‌లో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బి.ఎ.రాజు మాట్లాడుతూ- ప్రేమాభిషేకం సినిమానుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. ప్రెస్‌ను గౌరవిస్తే దాని ద్వారా ప్రజలను గౌరవించినట్లుగా దాసరి భావించేవారు. ఎప్పుడూ ఆయన చుట్టూ పదిమంది ఉండేవారు. ఎవరు సమస్యల్లో వున్నా ఆయన దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది అన్నారు. వినాయక్‌రావు మాట్లాడుతూ- సినిమా జర్నలిస్టులలో ఎవరికీ దొరకని అదృష్టం నాకు కలిగింది. ఆయన చేసిన సినిమాలతో విశ్వవిజేత అనే పుస్తకాన్ని రాశాను. ఆ సమయంలో ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగాను అన్నారు. ఇందులో సురేష్ కొండేటి, రామారావు, సాయిరమేష్, మధు, బాల్‌రెడ్డి, ప్రభు, సినీ జర్నలిస్టులు పాల్గొన్నారు.