సౌత్ క్వీన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పట్లో బాలీవుడ్‌లో విడుదలైన క్వీన్ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నో అవార్డులతోపాటు రివార్డులను అందుకున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషించి జాతీయ అవార్డు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నటుడు నిర్మాత త్యాగరాజన్. గత కొద్దికాలంగా ఈ సినిమాకు సంబంధించిన పనుల్ని మొదలుపెట్టిన ఆయన హీరోయిన్ విషయంలో కన్‌ఫ్యూజ్ అయ్యాడు. పలువురు హీరోయిన్లను సంప్రదించినప్పటికీ రెమ్యూనరేషన్, డేట్స్ ప్రాబ్లంవల్ల చాలామంది తప్పుకున్నారు. మొదట్లో తమన్నాతో చేద్దామనుకున్న త్యాగరాజన్, ఇప్పుడు ఆమె స్థానంలో గ్లామర్ భామ కాజల్‌ను తీసుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కాజల్‌తో చర్చలు జరుపుతున్నాడని, త్వరలోనే దీనికి సంబంధించిన తుది నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయంటూ కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.