ఫోకస్

చట్టాలను కఠినం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ఒక సినీనటుడు మహిళలపై అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగించారు. చివరకు క్షమాపణ చెప్పాడు. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే మహిళ ఉద్యోగిని పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ప్రతిభావంతులైన మహిళలంటే అసూయతో కొంతమంది విపరీత చేష్టలకు పాల్పడుతున్నారు. సెలబ్రిటీలు చౌకబారు పాపులారిటీకోసం మహిళలను సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తూ కించపరుస్తున్నారు. దీని ప్రభావం యువతపై ఉంది. వీరేశలింగం పంతులు, రాజా రామ్‌మోహన్‌రాయ్, రఘుపతి వెంకటరత్నం నాయుడు, త్రిపురనేని రామస్వామి చౌదరి తదితర మహనీయులు మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. భారతదేశ సంస్కృతిలో మహిళలకు గౌరవం ఉంది. ఇతర దేశాలు మన సంస్కృతిని చూసి అనేక విషయాలు నేర్చుకున్నారు. పిల్లలకు విద్యార్థి దశనుంచి నైతిక విద్యను బోధించాలి. కంప్యూటర్, ఇంటర్నెట్ మాయాజాలానికిలోనై సుమతీ శతకం, వేమన శతకం, దాశరథి శతకంను మర్చిపోయాం. పిల్లలకు అమ్మ అంటే తెలియదు. మమీ అంటే తెలుస్తుంది. భారత భవిష్యత్తును పరిరక్షించుకోవాలంటే ముందుగా ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో నైతిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేసేవారిని ఉపేక్షించరాదు. పోలీసు విభాగాలు యువతులు ఫిర్యాదు చేసిన వెంటనే రంగంలోకి దిగాలి.
- తాతినేని పద్మావతి, వైకాపా ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి