ఫోకస్

సమాజంలోనే మార్పు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలను కించపర్చడం అనేది ఒక ప్రసార సాధనాలు, సినిమాల్లోనే జరగడం లేదు. సమాజవ్యాప్తంగా మహిళలను కించపర్చడమో, చిన్న చూపు చూడటమో జరుగుతూనే ఉంది. సినిమాలు, వాటి వేదికలు, టీవీ కార్యక్రమాలలో మహిళల గురించి చేసే వ్యాఖ్యలను మాత్రమే మీడియా పెద్దది చేసి చూపిస్తోంది తప్ప సమాజంలో ఇతరచోట్ల మహిళ పట్ల కొనసాగించే వివక్షను హైలెట్ చేయడం లేదు. మహిళను కించపర్చడం అంటే కేవలం ఒక్క వ్యాఖ్యలు మాత్రమే కాదని నా అభిప్రాయం. స్థానిక సంస్థలలో మహిళలకు కల్పించిన రిజర్వేషన్లను పురుష్యాధిక్యత సమాజం అపహస్యం చేసే విధంగా వ్యవహరిస్తుంది. ఎంపిపిలు, జెడ్పీటిసీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లుగా మహిళలు ఉన్నచోట వారి భర్తలు అధికారాన్ని చెలాయించడం వారిని కించపర్చడం కాదా? ఇలాంటి ఉదంతాలను సమాజం ఎందుకు పట్టించుకోవడం లేదు. సినిమా వాళ్లు సెలబ్రిటీలు కావడంతో వారు మాత్రం చేసే వ్యాఖ్యలను మాత్రమే బూతద్దంలో చూపిస్తున్నారు. అలాగని సినీ రంగానికి చెందిన వారు మహిళలను ఉద్దేశించి చేసే వ్యాఖ్యలను సమర్థించడం లేదు. మహిళలను కించపరిచేవారు ఎవరైనా, ఏ రంగానికి చెందిన వారైనా, యావత్తు సమాజంలో ఎక్కడ జరిగినా ముక్తకంఠంగా ఖండించే పరిస్థితి రావాలన్నది నా అభిప్రాయం.

- కవిత తెలుగు మహిళా నాయకురాలు