ఫోకస్

శ్రుతి మించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల్లో ద్వందర్థాలు, అశ్లీలతో కొత్తవేమి కాదు. అయితే గతంలో శృంగారం, అశ్లీలత అంటే.. సాహిత్యపరంగా ఉండేది. సమాజాశ్రేయస్సు, సాహితీప్రియులు ఆస్వాదించే ద్వందార్థం రంగరించి మరీ సన్నివేశాలను చిత్రీకరించేవారు. దీంతో సాహితీప్రియుల్లోనూ, సినీ ప్రేక్షకుల్లోనూ ఎలాంటి చెడు భావన కలుగకుండా సినిమాలు వచ్చేవి. ప్రస్తుతం సినిమాల్లో కాస్తంత అశ్లీలత, శృంగారం శ్రుతిమించాయి. శృంగారం శ్రుతి మించితే యువతపై చెడు ప్రభావం పడుతుంది. గతంలో నర్తకీమణులు తమ నటనా చాతుర్యంతో నాట్యరూప భంగిమల్లో శృంగారాన్ని ప్రదర్శించేవారు. ఇప్పటి సినిమాల్లో కథానాయికలే అర్ధనగ్న శృంగారాన్ని వలకబోస్తున్నారు. అలనాటి సినిమాల్లో శృంగారానికి ఒక సన్నివేశం, దానికి తగ్గట్టు ఒక డ్యాన్సర్ ఉండేది. శృంగార సన్నివేశానికి తగ్గట్టుగా అశ్లీలతపై విమర్శలకు తావివ్వకుండా నర్తించి ప్రేక్షకులను మెప్పించేవారు. కాని ఇప్పటి సినిమాల్లో హీరోయిన్లతోనే శృంగారం, అశ్లీలతకు సంబంధించి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఇది కాస్త సంస్కరించబడాలి. అశ్లీలత కానీ, ద్వందర్థాలు కానీ, శృంగార వంటి ప్రదర్శనలు సాహిత్య రూపంలో ఉంటే బాగుంటుంది. అప్పుడు ప్రేక్షకులచే ఆదరించబడి, ఆస్వాదించే అవకాశం ఉంటుంది. చలనచిత్ర పరిశ్రమ పూర్వపు సినిమాలను దృష్టిలో పెట్టుకుని, సినిమాల్లో శ్రుతి మించుతున్న అశ్లీలత, శృంగారం వంటి వాటిని నియంత్రించాలి. సమాజంపై ఎలాంటి దుష్ప్రభావం చూపని సినిమాలు రావాలి. సినిమాల్లో ప్రధానంగా మహిళలను అవమానపరిచే విధంగా ద్వందర్థాలు, శృంగార సన్నివేశాలను అరికట్టాలి.
- కె అరవిందరావు, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్