ఫోకస్

జుగుప్స కలిగిస్తే కేసులు పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీవీ చానళ్లలో, కొన్ని చర్చా వేదికల్లో పాపులారిటీ కోసం, లేదా ప్రొగ్రాంలకు రేటింగ్‌లు పెంచేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, సభ్యసమాజం తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేయడం ఫ్యాషెన్‌గా మారింది. మంచి చానళ్లుగా పేరున్న సంస్థలు కూడా ఈ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. ఇది దురదృష్టకరమైన పరిణామం. ప్రజల్లో మార్పు రావాలి. కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తే తప్పని సరిగా కోర్టులో కేసులు దాఖలు చేయాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దుందుడుకుతనంతో, మంచి పేరున్న ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీపైన ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. అరుణ్ జైట్లీ ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనివల్ల దుందుడుకుగా మాట్లాడికే తీవ్రమైన చట్టపరమైన చర్యలు తప్పవనే భయం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే సెలబ్రిటీలు వ్యవహరిస్తే, ఎవరినైనా కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తే, వాటిని భరించకూడదు. తప్పనిసరిగా కేసులు దాఖలు చేయాలి. టీవీల్లో కొన్ని సన్నివేశాల్లో చోటుచేసుకునే ద్వంద్వార్థ సంభాషణలను మీడియా కూడా ప్రచురించకూడదు. సినిమా నిర్మాతలు, దర్శకులు కూడా ఏ వర్గాన్ని కించపరుస్తూ సన్నివేశాలు తీయరాదు. కొంతవరకు అంటే ఒక మోతాదు వరకు హాస్యంగా అయితే ఫర్వాలేదు. అంతేకాని సామాజిక వర్గాల మనోభావాలను పూర్తిగా గాయపరిచే విధంగా సంభాషణలు ఉండరాదు. కాని కొంతమంది పాపులారిటీకోసం వీటిని కూడా వాడుకుంటారు. అలాగే తమ సినిమాకు పేరు రావాలని కూడా కొంతమంది ప్రచారం చేయిస్తుంటారు. సినిమాలు, టీవీలు, సామాజిక మాద్యమాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం నశించింది. ఇటీవల ఒక కార్యక్రమంలో ఒక సినిమా వ్యక్తి మాట్లాడిన తీరుపై మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయ. ఆయన వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు కూడా పెట్టారు. అయతే ఆ వ్యాఖ్యలను అతను ఉపసంహరించుకోవడం మంచి పరిణామం. సామాజిక సంఘాలు అనుచిత వ్యాఖ్యలను సహించరాదు. చట్టపరమైన ప్రజాస్వామ్యబద్ధమైన రీతిలో స్పందించి న్యాయపరంగా, పోలీసుపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
- ఎం పద్మనాభరెడ్డి
ప్రధాన కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్