ఫోకస్

సమాజంపై తీవ్ర ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీవి, సినిమా అనేది సమాజంపై బలమైన ప్రభావం చూపించే మాధ్యమాలు. సరిగా ఉపయోగించుకుంటే సమాజానికి మేలు కలుగుతుంది. లేకపోతే తీవ్రంగా నష్టం కలుగుతుంది. మేలు చేయక పోయినా పరవాలేదు కానీ సమాజాన్ని పెడదారి పట్టించే విధంగా ఈ మాధ్యమంలో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీవిలో కార్యక్రమాలైనా, సినిమా అయినా ఇంటిల్లిపాది కలిసి చూసేట్టుగా ఉండాలి. జ్ఞానాన్ని ప్రసాదించక పోయినా పరవాలేదు కానీ చెడువైపు ఆకర్షితులు అయ్యేట్టుగా చేయకూడదు. కానీ ఇటీవల ద్వంద్వార్థాలు, వెకిలి మాటలు, రెచ్చగొట్టే దృశ్యాలు మితిమీరిపోతున్నాయి. గతంలో కొంతకాలం తెలుగులో హిందీలో ద్వంద్వార్థపు సినిమాలు రాజ్యం ఏలాయి. తరువాత ప్రేక్షకులు వాటిని ఆదరించడం మానేసిన తరువాత అలాంటి సినిమాలు రాలేదు. అయితే ఇప్పుడు ఏకంగా ఇంటిల్లిపాది చూసే టీవిల్లోనే అలాంటి కార్యక్రమాలు దర్శనం ఇస్తున్నాయి. సినిమా ప్రమోషన్ అయినా, కామెడీ పేరుతో కాలేజీ పిల్లలతో కూడా అభ్యంతరకరంగా మాట్లాడిస్తున్న కార్యక్రమాలైనా సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు. టీవిలో తమ ముఖం కనిపిస్తుందనే ఉత్సాహంతో కాలేజీ పిల్లలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించవచ్చు. కానీ వారితో నిర్వాహకులు చెప్పిస్తున్న డైలాగులు బాధకలిగిస్తున్నాయి. టీవి చూసేవారికి కాలేజీ పిల్లలే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనిపిస్తుంది కానీ నిజానికి వాళ్లు ఏం మాట్లాడాలో నిర్వాహకులే ముందుగా రాసి ఇస్తారు. సినిమాలకు కలెక్షన్లు కావాలి, టీవి చానళ్లకు టిఆర్‌పి రేటింగ్ కావాలి. దానికోసం ఎంతకైనా తెగిస్తాం అన్నట్టుగా ఉంది వారి వ్యవహారం. అశ్లీలతను అడ్డుకోవలసిన అవసరం ఉంది. మహిళలు అంటే గౌరవం లేకుండా టీవిల్లో లైవ్‌గా మాట్లాడుతున్నారు. కుటుంబ సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలపై ఏమాత్రం విలువ లేకుండా సాగుతున్నాయి కొన్ని కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న పెద్దలు, తీస్తున్న వారు వాటిపై కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుంది. ఆదాయం చాలు సమాజం ఏమై పోతే మనకేంటి అనే ఆలోచన ప్రమాదకరం. ఈ వైఖరిని వ్యతిరేకించాలి. ఆరోగ్య కరమైన సమాజం కోసం ఆలోచించాలి.
- లక్కరాజు దేవి, న్యాయవాది