ఫోకస్

పిల్లలకు నైతిక విలువలు బోధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి సమాజంలో పెడధోరణులు పెరిగిపోవడానికి చిన్నకుటుంబ వ్యవస్థతోపాటు అనేక కారణాలున్నాయి. మన సమాజంలో గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో పెద్దల సమక్షంలో పిల్లలు పెరిగేవారు. పాఠశాలల్లోనూ నియత విద్య మాత్రమే బోధించేవారు. గురువుల పట్ల ఎంతో గౌరవభావం ఉండేది. కుటుంబాల్లో పిల్లలకు అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు తదితరులు కథలు, పురాణాల రూపంలో నైతిక విలువల గురించి బోధించేవారు. ఇప్పుడు చిన్న కుటుంబాల వ్యవస్థ కొనసాగుతోంది. ఈ వ్యవస్థనే అనేక అవస్థలకు మూలకారణం అవుతోంది. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నది అందరికీ తెలిసిన నానుడే. ‘మొక్కై వంగనిదే మానై వంగునా?’ అని కూడా ఒక నానుడి ఉంది. అంటే చిన్న పిల్లల స్థాయిలోనే సామాజిక విలువలు, నైతిక విలువల గురించి బోధించాల్సిన అవసరం ఉంది. ఈ పని ఇళ్లల్లో పెద్దమనుషులు ఉంటేనే సాధ్యమవుతుంది. నేడు వివిధ కారణాల వల్ల ఉద్యోగం చేసుకునే భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారు. వారి తల్లిదండ్రులు వేర్వేరుగా జీవిస్తున్నారు. దాంతో యువప్రాయంలో భార్యాభర్తలు తమ పిల్లలపై పెద్దగా శ్రద్ద చూపించలేకపోతున్నారు. ఈ వ్యవస్థలో మార్పులు రావలసిన అవసరం ఉంది. గతంలో సినిమాల్లో శృంగారం ఒక పరిమితిని దాటేది కాదు. ఇప్పుడు శృంగారం బరితెగించిపోయింది. టివీల్లో కూడా పెడధోరణులు కనిపిస్తున్నాయి. ఒక కులాన్ని కాని, ఒక మతాన్ని కాని, ఒక వర్గాన్ని కాని కించపరిచే విధంగా సినిమాల్లో, టివీల్లో, ప్రచార మధ్యమాల్లో చూపించడం క్షంతవ్యం కాదు. అసలు ఒక వర్గాన్ని ఎందుకు కించపరచాలి. హాస్యం పేరుతో ఏదో ఒక వర్గాన్ని కించేపరిచేలా చేసే టీవీ కార్యక్రమాలు గాని, సినిమాలు గాని మనం చూడకుండా వెలివేయాలి. ఒకవైపు శాస్ర్తియ రంగంలో ఉన్నత శిఖరాలవైపు వెళుతున్న భారతీయ సమాజం, నైతిక విలువల్లో మాత్రం పూర్తిగా పతనావస్థ దిశలో కొనసాగుతోంది. సమాజంలో మనమంతా ఆలోచించాల్సిన తీవ్రమైన విషయమిది. సమసమాజాన్ని, నైతిక విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
- ద్రోణంరాజు రవికుమార్,
అధ్యక్షుడు, అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ యువజన విభాగం