బిజినెస్

జిఎమ్‌ఆర్ చేతికి గ్రీస్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: జిఎమ్‌ఆర్ చేతికి గ్రీస్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు వచ్చింది. ఆ దేశ వౌలిక రంగ దిగ్గజం జిఇకె టెర్నా గ్రూప్ అనుబంధ సంస్థ టెర్నా ఎస్‌ఎతో కలిసి ఈ ప్రాజెక్టును జిఎమ్‌ఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ అభివృద్ధిపరచనుంది. క్రెటె వద్ద నిర్మించే ఈ హెరక్లియాన్ నూతన అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్వహణను తమ కూటమి చూస్తుందని ఓ పత్రికా ప్రకటనలో జిఎమ్‌ఆర్ ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్ చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల తెలిపారు. కాగా, ఇప్పటికే ఉన్న హెరక్లియాన్ ఎయిర్‌పోర్టులో గడచిన 3-4 ఏళ్ల నుంచి రద్దీ పెరుగుతుండగా, ప్రస్తుతం దీని వార్షిక ప్యాసింజర్ల సామర్థ్యం 60 లక్షలపైనే.