బిజినెస్

దేశంలోకి భారీగా ఎఫ్‌డిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) 2013 నుంచి గమనిస్తే భారీ స్థాయిలో వచ్చాయని, నాడు 34,487 బిలియన్ డాలర్లుగా ఉంటే, నేడు 61,724 బిలియన్ డాలర్లకు పెరిగాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ మూడేళ్ల పాలనపై బుధవారం మోదీ ఇక్కడ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం భారత్ ఓ కాంతిపుంజంగా ఉందన్నారు. సరళతరమైన, సుస్థిరమైన పన్నుల విధానం అమల్లో ఉందని పేర్కొన్నారు. చారిత్రాత్మక వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను కూడా వచ్చే నెల 1 నుంచి అమల్లోకి తెస్తున్నామని చెప్పారు. అవినీతి, అక్రమాలను తుదముట్టించడానికి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు.