బిజినెస్

వర్షాలు తెచ్చిన ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయంటూ గత అంచనాలను వాతావరణ శాఖ సవరించడం మదుపరులను ఉత్సాహపరిచింది. అంతేగాక చట్టబద్ధ ద్రవ్యనిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్)ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అర శాతం తగ్గించడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. బ్యాంకుల చేతికి మరిన్ని నిధులు అందేలా ఆర్‌బిఐ నిర్ణయం ఉండగా, ఈ కారణంతోనే మదుపరులు బ్యాంకింగ్ రంగ షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. ఫలితంగా ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు 1.91 శాతం నుంచి 0.10 శాతం మేర పెరిగాయి. హెల్త్‌కేర్, మెటల్, ఎనర్జీ, ఆటో, ఎఫ్‌ఎమ్‌సిజి, ఫైనాన్స్ రంగాల షేర్లు కూడా లాభపడగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 80.72 పాయింట్లు పెరిగి 31,271.28 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 26.75 పాయింట్లు అందుకుని 9,663.90 వద్ద నిలిచింది.