బిజినెస్

మారని రెపో, రివర్స్ రెపో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, జూన్ 7: ఊహించినట్లుగానే కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ). ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను నిర్వహించిన రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష బుధవారం ముగిసింది. మంగళవారం మొదలైన ఈ సమీక్షలో ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులుగల మానిటరీ పాలసీ కమిటీ (ఎమ్‌పిసి) రెపో, రివర్స్ రెపోలను యథాతథంగానే ఉంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఐదుగురు సభ్యులు మద్దతు పలికారు. అయితే చట్టబద్ధ ద్రవ్యనిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్)ని మాత్రం 0.5 శాతం తగ్గించి 20 శాతానికి తెచ్చారు. ప్రభుత్వ సెక్యురిటీల్లో డిపాజిట్ల రూపంలో బ్యాంకులు పెట్టే నగదు పరిమాణమే ఎస్‌ఎల్‌ఆర్. ఇది ఇప్పుడు అర శాతం తగ్గడంతో బ్యాంకుల చేతికి మరింత నిధులు అందనున్నాయి. ఫలితంగా పెరిగిన ద్రవ్యలభ్యత రుణాలపై వడ్డీరేట్లను తగ్గించేలా బ్యాంకులకు దోహదపడగలదన్న అభిప్రాయాన్ని ఆర్‌బిఐ ఈ సందర్భంగా వ్యక్తం చేసింది. కాగా, ప్రైవేట్‌రంగ పెట్టుబడులు పెరిగేలా వడ్డీరేట్లను తగ్గించాలని ప్రభుత్వం ఒత్తిడి చేసినట్లు, జూన్ 1, 2 తేదీల్లోనే ఎమ్‌పిసి సమావేశం కావాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించినట్లు ఆర్‌బిఐ గవర్నర్ పటేల్ చెప్పారు. అయితే సభ్యులమంతా దీన్ని తిరస్కరించామని పేర్కొన్నారు. ఇకపోతే రెపో రేటును యథాతథంగా ఉంచడం ఇది వరుసగా నాలుగోసారి. గడచిన నాలుగు ద్రవ్యసమీక్షల్లో రెపో రేటు 6.25 శాతం వద్దే ఉంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు అంచనాను కూడా 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది ఆర్‌బిఐ. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు ఆధారంగా ద్రవ్యవిధానంలో మార్పులు చేపట్టాలని ఆర్‌బిఐ భావిస్తున్నట్లు సమాచారం.
కార్పొరేట్ల అసంతృప్తి
రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంపట్ల దేశీయ వ్యాపార, పారిశ్రామిక రంగాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అసోచామ్, పిహెచ్‌డిసిసిఐలు కీలక వడ్డీరేట్లను తగ్గించాల్సి ఉందని అభిప్రాయపడ్డాయి. అధిక రుణ భారంతో సతమతమవుతున్న సంస్థలకు వడ్డీరేట్ల తగ్గింపు గొప్ప ఊరటనిచ్చేదని పేర్కొన్నాయి.

చిత్రం; డిప్యూటి గవర్నర్లతో ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ (మధ్యలో)