క్రీడాభూమి

లంకతో మ్యాచ్‌కి భారత్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 7: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం శ్రీలంకతో మ్యాచ్‌కి కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అన్ని విధాలా సిద్ధంగా ఉంది. మొదటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 124 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసిన భారత్ అదే ఉత్సాహంతో లంక భరతం పట్టి, సెమీస్‌కు దూసుకెళ్లాలన్న పట్టుదలతో ఉంది. దక్షిణాఫ్రికాను ఢీకొని, 96 పరుగుల తేడాతో ఓటమిపాలైన కారణంగా ఆత్మవిశ్వాసం దెబ్బతిన్న లంకను భారత్ ఎదుర్కోవడం భారత్‌కు కష్టం కాదని విశే్లషకుల అభిప్రాయం. ఓపెనర్లు రోహిత్ శర్మ (91), శిఖర్ ధావన్ (68) పాక్‌పై అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. కోహ్లీ (81 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యువరాజ్ సింగ్ (53) కూడా అర్ధ శతకాలతో కదంతొక్కాడు. టాప్ ఆర్డర్‌లో నలుగురు అర్ధ శతకాలను నమోదు చేయడం భారత్ బ్యాటింగ్ బలాన్ని రుజువు చేస్తున్నది. చివరిలో కోహ్లీతోపాటు నాటౌట్‌గా ఉన్న హార్దిక్ పాండ్య ఆరు బంతుల్లోనే 20 పరుగులు చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్న భారత్‌కు బౌలింగ్ కూడా మెరుగుపడింది. పాకిస్తాన్‌పై ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు పడగొడితే, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య చెరి రెండు వికెట్లు కూల్చారు. భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా వికెట్లు సాధించడంలో విఫలమైనప్పటికీ, పాక్ బ్యాట్స్‌మెన్‌ను బాగానే కట్టడి చేశారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో బలపడిన టీమిండియాకు శ్రీలంక ఎంత వరకు బలమైన పోటీనిస్తుందనేది అనుమానమే. 2015 ప్రపంచ కప్ తర్వాత కుమార సంగక్కర, మహేల జయవర్ధనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో, వారి స్థానాన్ని భర్తీ చేయగల సమర్థులు ఇంకా లభించకపోవడం లంక జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. దినేష్ చండీమల్, చమర కపుగడేరా దేశవాళీ టోర్నీల్లో సమర్థులుగా పేరు సంపాదించినప్పటికీ, ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీనికితోడు స్టాండ్‌బై కెప్టెన్ ఉపుల్ చందనపై రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్ వేటు పడడం లంక సమస్యలను మరింతగా పెంచుతున్నది. మొత్తం మీద ఏ రకంగా చూసినా భారత్ హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతుండగా, శ్రీలంక తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల్సివుంది.