అంతర్జాతీయం

నేపాల్ ప్రధానిగా షేర్ బహదూర్ దేవుబా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, జూన్ 7: నేపాల్ కొత్త ప్రధానిగా షేర్ బహదూర్ దేవుబా ఎన్నికయ్యారు. నేపాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన దేవుబా ప్రధాని పదవి చేపట్టడం ఇది నాలుగోసారి. నేపాల్ మావోయిస్టు పార్టీ అధినేత పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ స్థానంలో దేవుబాను పార్లమెంటు ఎన్నుకుంది. అధికార మార్పిడిలో భాగంగా తొమ్మిది నెలలు ప్రధానిగా పనిచేసిన ప్రచండ ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు. నేపాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా (70) కొత్త ప్రధానిగా బాధ్యతల చేపట్టారు. దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంగళవారమే దేవుబాను పార్లమెంటు నాయకునిగా ఎన్నికయ్యారు. నేపాల్‌కు ఆయన 40వ ప్రధాన మంత్రి. 601 మంది సభ్యులుగల పార్లమెంటులో 558 ఓట్లు పోలవ్వగా దేవుబాకు 388 ఓట్లు వచ్చాయి. ప్రధాని పదవికి ఆయనొక్కరే పోటీచేశారు. దేవుబా విద్యాధికుడు. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం 2016లో ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. నేపాల్ కష్టాల్లో ఉన్న ప్రతిసారీ పదవి చేపట్టి సమర్థవంతంగా పనిచేశారన్న పేరుం ది. భారత్‌లోని పలువురు ప్రముఖ నాయకులతో దేవుబాకు మంచి సం బంధాలు ఉన్నాయి. నేపాల్ రాజ్యాం గ సవరణ విషయంలో ఆయన కీలక భూమిక పోషించారు. 1995-97, 2001-2002, 2004-2005లో ప్రధానిగా పనిచేశారు.