జాతీయ వార్తలు

మోదీ..అత్యంత శక్తివంతమైన ఇంజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వం చేసే ఖర్చు అనే ఒకే ఒక ఇంజన్‌తో నడుస్తోందంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖల మత్రి ఎం వెంకయ్య నాయుడు బుధవారం ఎద్దేవా చేస్తూ నరేంద్ర మోదీ అనే అత్యంత శక్తివంతమైన ఇంజన్ సాయం తో భారత్ పరుగులు తీస్తోందనే విషయాన్ని ఆయన గ్రహించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై వ్యాఖ్యానిస్తూ దేశ ఆర్థిక వృద్ధి మందగించడానికి అదే కారణమని అన్నారు. పెద్దనోట్ల రద్దు కారణంగా ప్రైవేటు రంగంలో పెట్టుబడులు కుప్పకూలిపోయాయని, పారిశ్రామిక రంగం లో స్థూల విలువ ఆధారిత వృద్ధి తగ్గిపోయిందని అన్నారు. నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడొక ఇంజన్‌కోసం ఎదురు చూస్తోందని వెంకయ్య నాయుడు అన్నా రు. తమ కుటుంబ సమస్య భారతదేశ సమస్యగా చూస్తుండడమే కాంగ్రెస్ పార్టీకున్న పెద్దసమస్య అని, 2014 ఎన్నికల్లో మోదీని కనుగొనడం ద్వారా దేశ ప్రజలు ఈ సమస్యను పరిష్కరించారని వెంక య్య చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక సమైక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను వెంకయ్య ఎద్దేవా చేస్తూ అవినీతిపరులు, కులతత్వవాదులు, మతతత్వవాదులు కలిసి ఈ ప్రయత్నం చేస్తున్నారని, అయితే విజయవంతం కాబోదని, అంతేకాదు కేరళ, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ప్రధాన ప్రత్యర్థిగా బిజెపి బలపడడానికి మాత్రమే అది తోడ్పడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, తృణమూల్ కాంగ్రెస్ ఒక్కటి కావడం వల్ల బిజెపి మరింత బలపడుతుందని జోస్యం చెప్పారు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఉమ్మడి సిద్ధాంతం, కనీస ఉమ్మడి కార్యాక్రమం, నాయకత్వంపై ఏకాభిప్రాయం లేకుండా ఏర్పడిన నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, థర్డ్‌ఫ్రంట్‌లు ఏమయ్యాయో అందరికీ తెలిసిందేనని అన్నారు. కాగా. ఎన్డీటీవీ కార్యాలయంపై ఎలాంటి దాడులు జరగలేదని, సిబిఐ అధికారులు ఆ న్యూస్ చానల్‌కు చెందిన ఏ కార్యాలయంలోకి ప్రవేశించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఆ చానల్‌పై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండిస్తూ యాజమాన్యం, ప్రమోటర్లు విచారణను ఎదుర్కొని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతయినా ఉందని అన్నారు.

ఢిల్లీలో డిఏవిపి నిర్వహిస్తున్న ప్రదర్శనను తిలకిస్తున్న
కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్