జాతీయ వార్తలు

రైతుకు ‘మద్దతు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 14 పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్రం బుధవారం ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. రుతుపవనాలతో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటం, వచ్చే నెల రైతులు పంటలు వేయడం పూర్తిస్థాయిలో జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధరలను భారీగా పెంచు తూ నిర్ణయం తీసుకుంది. కనీస మద్దతు ధరల పెంపునకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయనప్పటికీ, మంత్రివర్గం 2017-18 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వ్యవసాయ మంత్రిత్వ శాఖ చేసిన సిఫార్సులను యథాతథంగా ఆమోదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు వ్యవసాయ రుణాల మాఫీ, పంటలకు గిట్టుబాటు ధరల కోసం ఆందోళనలు చేస్తున్న తరుణంలో మంత్రివర్గం కనీస మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఆందోళనల వేడి తగ్గుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది.
వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ బుధవారం స్వచ్ఛ్భారత్‌పై తన విలేఖరుల సమావేశాన్ని రద్దు చేసుకున్న నేపథ్యంలో, కేబినెట్ సమావేశం తర్వాత మీడియా సమావేశం కూడా రద్దయింది.
వ్యవసాయ మంత్రిత్వ శాఖ వరి ధాన్యానికి కామన్ గ్రేడ్ రకానికి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు 80 రూపాయలు అంటే రూ. 1550కి,ఏ గ్రేడ్ వెరైటీకి రూ.1590కి పెంచాలని సిఫార్సు చేసింది. కాగా, పప్పు్ధన్యాలకు కనీస మద్దతు ధరను 2017-18 ఖరీఫ్ సీజన్‌కు రూ. 200 బోనస్‌తో కలుపుకొని క్వింటాల్‌కు రూ. 400 పెంచాలని వ్యవసాయ శాఖ సిఫార్సు చేసింది. మధ్యప్రదేశ్‌లో ప్రధాన పంట అయిన సోయాబీన్ కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ 175 పెంచాలని సిఫార్సు చేయగా, పత్తి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ 100 పెంచాలని సిఫార్సు చేసింది. వ్యవసాయ ధరల కమిషన్ చేసే సిఫార్సుల ఆధారంగా వ్యవసాయ శాఖ చేసే ప్రతిపాదనలను కేంద్రమంత్రివర్గం సాధారణంగా ఆమోదించడం జరుగుతుంది.
ఇదిలా ఉండగా దేశంలో 20 ప్రపంచ స్థాయి యూనివర్శిటీలను రూపొందించడానికి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనపై నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం వాయిదా వేసింది. సమావేశం అజెండాలో ఈ అంశం ఉన్నప్పటికీ మంత్రివర్గం దీనిపై నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ 20 యూనివర్శిటీల్లో పది ప్రభుత్వ రంగలో మరో పది ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేస్తారు. ఈ కొత్త ప్రపంచస్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు సంబంధించి యుజిసి గత ఫిబ్రవరిలో కొత్త నిబంధనావళిని కూడా ఆమోదించింది.