రాష్ట్రీయం

రాజధానికి మెడ్‌టెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: ఫార్మా రంగంలోనే నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన హైదరాబాద్ సిగలో ఇదే రంగానికి చెందిన మరో కలికితురాయి చేరబోతుంది. దేశ విదేశాలకు ఇక్కడ తయారు చేస్తున్న ఫార్మాస్యూటికల్స్ (ఔషధ ఉత్పత్తులు) ఎగుమతి అవుతున్నప్పటికీ, వైద్య పరికరాలను మాత్రం విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇకనుంచి అలాంటి పరిస్థితి తలెత్తకుండా వైద్య పరికరాలను సైతం హైదరాబాద్‌లోనే తయారు చేయడానికి మెడ్ టెక్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నగర శివారు పటాన్‌చెరు సమీపంలోని సుల్తాన్‌పూర్‌లో 250 ఎకరాల విస్తీర్ణంలో మెడ్ టెక్ పార్క్‌కు ఈనెల 17 ప్రారంభించనున్నట్టు ఐటీ మంత్రి కె తారకరామారావు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే వైద్యరంగం పరిశోధనల్లో నైపుణ్యం, ఇంజనీరింగ్ ప్రతిభ కలిగి ఉండటంతో మెడ్ టెక్ పార్క్ ఏర్పాటుకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. మెడ్ టెక్ పార్క్‌లో తయారు చేసే వైద్య (ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్, మెటల్) ఉపకరణాలకు అంతర్జాతీయ మార్కెట్ ఉంటుందని మంత్రి కెటిఆర్ అన్నారు. దేశంలోని మహానగరాలలో ఒకటి, అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు గ్లోబల్ మార్కెటింగ్‌కు అవకాశాలు, స్థానికంగా వైద్యరంగానికి సంబంధించిన విద్యా, పరిశోధన, అభివృద్ధి వనరులు కలిగి ఉండటంతో మెడ్‌టెక్ పార్క్‌కు ప్రపంచ దృష్టిని ఆకర్షించనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం, ప్రభుత్వ తోడ్పాటు అన్నీ మెడ్‌టెక్ పార్క్ రాణించడానికి దోహదం చేస్తాయని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటి సాంకేతిక సహకారాన్ని అందించనుందన్నారు. మెడ్‌టెక్ పార్క్ సెబి కేటగిరి కిందకు వస్తుందని, ఈ స్టార్టప్‌కు ఒక నిధిని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందించనుందని మంత్రి వివరించారు.