రాష్ట్రీయం

10న టెట్ నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: తెలంగాణ రాష్ట్రంలో బిఇడి, డిఇడి కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థుల కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. టెట్ నిర్వహణ, తర్వాత డిఎస్‌సి నిర్వహణకు సంబంధించి విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. తర్వాత మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ టెట్ కోసం ఈనెల 10న నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఈ పరీక్ష కోసం ఆన్‌లైన్ లేదా పేమెంట్ గేట్‌వే ద్వారా ఈనెల 12నుంచి 22 వరకు ఫీజు తీసుకుంటారు. జూన్ 12న టిఎస్ టెట్ ఇన్‌ఫర్మేషన్ బులెటిన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 13నుండి 23వరకు ఆన్‌లైన్‌లోనే (టిఎస్‌టెట్.సిజిజి.జిఓవి.ఇన్) దరఖాస్తులను పంపించాల్సి ఉంటుందన్నారు. జూన్ 12 నుండి 23 వరకు అన్ని పనిదినాల్లో హెల్ప్ డెస్క్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. జూలై 17న హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ్చని వివరించారు. జూన్ 23న టెట్ పరీక్ష ఉంటుందని, ఉదయం 9.30నుండి 12 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తామని వివరించారు. 2017 ఆగస్టు 5న ఫలితాలు వెల్లడిస్తామన్నారు.
టెట్ ఫలితాలు ప్రకటించిన వారం రోజుల్లోనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని కడియం శ్రీహరి వెల్లడించారు. జిల్లాలవారీగా 31 జిల్లాల్లోని టీచర్ పోస్టుల ఖాళీల వివరాలను తెప్పించి, వీటి భర్తీ ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. 2017 జూన్ వరకు తమవద్దనున్న సమాచారం ప్రకారం బిఇడి, డిఇడి కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు 26,100 మంది ఉన్నారని తెలిపారు. టెట్ ఫలితాల విడుదల తర్వాత ఈ సంవత్సరం 8,792 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఇలాఉండగా గురుకుల పాఠశాలల్లో వచ్చే ఏడాది 6000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రస్తుత సంవత్సరంతో పాటు వచ్చే సంవత్సరం కలిపి 27 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహకారం తీసుకుంటామన్నారు.
పకడ్బంధీగా భర్తీ ప్రకియ
ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను పకడ్బంధీగా నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితోపాటు మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన కూడా పాల్గొన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఖాళీల భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని చైర్మన్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలకు సంబంధించి పోస్టుల భర్తీ కోసం తమకు సమాచారం ఇచ్చిన వెంటనే భర్తీ ప్రక్రియను నిబంధనల మేరకు చేపడుతున్నామని చక్రపాణి వెల్లడించారు.

ఉన్నతాధికారులతో కలిసి టెట్ షెడ్యూల్‌ను వివరిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి