మెయిన్ ఫీచర్

పసందైన పొంగడాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూనె తక్కువతో వండే వంటకం
ఈ పొంగడాలు. నూనె లేకుండా కూరలు వండుకునేవారికి వారికి ఈ ఫలహారం నచ్చుతుంది. ఇడ్లీ వలే సాత్వికాహారం. వేడి వేడి పొంగడాలను చట్నీ అద్దుకుని తింటే రుచిగా ఉంటాయ. పొంగడాల తయారీకి ప్రత్యేక పళ్ళెం, మూత, ప్రత్యేక దబ్బనం లాంటి స్టిక్ ఉంటుంది.

వెజిటబుల్ పొంగడాలు
ఛాయమినప్పప్పు - 1 కప్పు, బియ్యం - 2 కప్పులు, పచ్చిశెనగపప్పు - 1/2 కప్పు, ఉప్పు - 1 చెంచా, నూనె - 5 చెంచాలు, క్యారెట్ కోరు, ఉల్లి, మిర్చి, అల్లం తరుగు - 1/2 కప్పు, జీలకఱ్ఱ - 1 చెంచా
పిండి రుబ్బి నానిన శెనగపప్పు కలిపి 24 గంటలు ఊరబెట్టాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మాదిరి చేసుకోవడానికి, ఉదయం క్యారెట్, మిర్చి తరుగులు అన్నీ కలిపి గరిటెతో గుంటల్లో పోసి మూత పెట్టాలి. ఐదు నిముషాల తరువాత మూత తీసి సూది గరిటెతో తిరగపెట్టాలి. మళ్లీ ఐదు నిమిషాల తరువాత తీసి పళ్ళెంలో పెట్టాలి.

పెరుగుతో
మినపప్పు, బియ్యం నానబెట్టిన పిండి - 4 కప్పులు, పెరుగు - 2 కప్పులు, ఉప్పు - 1 చెంచా, కరివేప - కొంచెం, ఇంగువ - కొంచెం,మినప్పప్పు, శెనగపప్పు - 2 చెంచాలుఆవాలు - 1 చెంచా, జీలకఱ్ఱ - 1 చెంచా, ఎండుమిర్చి - 2, పచ్చిమిర్చి - 2
ముందుగా గుంటలకి నూనె రాసి పొంగడాలు పోయండి. పెరుగుకి ఉప్పు, పోపు వేసి కలిపి ఒకప్రక్కన పెట్టాలి. పైన ఉడికిన పొంగడాలు తీసి పెరుగులో వేసి ఒక గంట నానబెట్టాలి. నూనె లేక (ఆవడలు) పెరుగు పొంగడాలు రెడీ.

మెంతికూరతో
మెంతికూర తరుగు - 2 కప్పులు, పెసరపప్పు - 1 కప్పు, జీలకఱ్ఱ - 1 చెంచా, మిర్చి - 4, అల్లం కోరు - 2 చెంచాలు, ఉప్పు - 1 చెంచా, నూనె - 1/4 కప్పు, ఆవాలు - 1 చెంచా, మినప్పప్పు - 1 చెంచా
సోడా - కొంచెం, మినప్పప్పు - 1 కప్పు, బియ్యం - 1 కప్పు
ముందుగా పెసరపప్పు, బియ్యం, మినప్పప్పు మెత్తగా రుబ్బుకోవాలి. దానికి మెంతికూర, అల్లం, మిర్చి చేర్చి, జీలకఱ్ఱ, సోడా చేర్చి కలిపి నాననివ్వాలి. ఒక గంట తర్వాత గుంటలకి నూనె రాసి పిండి పోసి మూత పెట్టాలి. ఇవి ఉడికాక బయటికి తీసి అల్లం చట్నీతో తినండి.

తీపి పొంగడాలు
మినప్పప్పు - 1 కప్పు, బియ్యం - 2 కప్పుల, సగ్గుబియ్యం - 1/2 కప్పు, బెల్లం తరుగు - ఒకటిన్నర కప్పు, ఏలకులు - 6, ఉప్పు - చిటికెడు, నెయ్యి - 1/4 కప్పు, సోడా - 1/2 చెంచా
మినపప్పు, బియ్యం నానబెట్టి మిక్సీ పట్టి ముద్దగా చేసుకోవాలి. బెల్లం తరుగు, కొబ్బరి, ఏలకులు అన్నీ చేర్చి సోడా కలిపి ప్రక్కన ఉంచాలి. గంట తర్వాత గుంటల్లో పోసి జీడిపప్పు, కిస్‌మిస్ ఉంచాలి. ఉడికాక తిరగవేసి తియ్యాలి. ఈ విధం గా పొంగడాలన్నీ చేసి అల్లం చట్నీతో వడ్డించాలి.

పెసలతో..
పెసలు మొలకొచ్చినవి - 2 కప్పులు
అల్లం, జీలకఱ్ఱ, మిర్చి - తగినంత
నూనె - 1/4 కప్పు
బియ్యపిండి - 2 చెంచాలు
ఉప్పు - తగినంత (1 చెంచా)
విధానము:ముందుగా పెసల మొలకలు రుబ్బి బియ్యంపిండి చేర్చి అల్లం మిర్చి, జీలకఱ్ఱ చేర్చి కలపాలి. దీన్ని పొంగడాల గుంటల్లో పొయ్యాలి. ఇవి వేగాక దింపి తియ్యాలి. టమోటా చట్నీతో వడ్డించాలి.