తూర్పుగోదావరి

ముందుగానే వచ్చిన ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, జూన్ 8: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించిన సమయం కంటే ముందుగానే కాకినాడ నగరానికి చేరుకున్నారు. చింద్రబాబు గురువారం మధ్యాహ్నం 3.30గంటలకు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారని అధికారులు ప్రకటించారు. అయితే ఆయన మధ్యాహ్నం 2.15 గంటలకే చేరుకున్నారు. సిఎం ముందుగానే వస్తున్నారని సమాచారంతో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, విద్యుత్‌శాఖ మంత్రులు కిమ్మిడి కళావెంకట్రావు, ప్రత్తిపాటి పుల్లారావు హెలీప్యాడ్ వద్దకు చేరుకుని ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. హెలీప్యాడ్‌కు సమీపంలో ఉంచిన ప్రత్యేక బస్సులో చందబ్రాబు లంచ్‌చేసి, విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం 3.45 గంటలకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి కాన్వాయ్‌లో బయలుదేరి ఆనందభారతి గ్రౌండ్‌లో జరిగే నవినిర్మాణదీక్ష ముగింపు మహాసంకల్పసభకు తరలివెల్లారు.
అసాధారణ భద్రత....
చంద్రబాబునాయుడు కాకినాడకు వచ్చిన సందర్భంగా పోలీసులు అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. పలువురు ఎస్పీలు, అడిషినల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, ఎఎస్సైలు, హెచ్‌సిలు, పిసిలు, హోంగార్డ్సు పాల్గొన్నారు. గురువారం ఉదయం నుండే పోలీసులు సిఎం వెల్లే కాన్వాయ్ రూట్‌లో ప్రతీ యాభైమీటర్లకు ఒక కానిస్టేబుల్‌ను నియమించారు. అంతే కాకుండా ప్రతీ కూడలినందు ఎస్సై, సిఐ స్థాయి అధికారులను నియమించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లోకి ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిదులు, అధికారులను, పోలీసులు జారీచేసిన పాస్‌లు ఉన్నవారిని అనుమతించారు. సిఎం వచ్చి వెళ్ల్లే మార్గంలో అన్ని షాపులను పోలీసులు ముందస్తుగా మూసివేయించారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలియని ఇతర ప్రాంతాలకు చెందిన వాహనదారులు ఏదారిలో ప్రయాణించాలో తెలియక తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. ఆర్టీసీ బస్సులను సైతం దారి మళ్లించడంతో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ఎక్కడి కక్కడ వాహనాలు ట్రాఫిక్‌లో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పాలయ్యారు. మాజీ కౌన్సిలర్ దూసర్లపూడి రమణరాజు కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించాలని గత కొన్నినెలలుగా ఉద్యమిస్తున్న నేపధ్యంలో ఆయనను పోలీసులు గృహనిర్భందంలో ఉంచారు. సిఎం కార్యక్రమం ముగిసిన అనంతరం గృహనిర్భందం నుండి విముక్తి కలిగించారు.