విజయనగరం

కళాక్షేత్ర నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్.కోట, జూన్ 8: మండలంలో తలారీ గ్రామంలో ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న కళాక్షేత్రానికి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల మాట్లాడుతూ గ్రామాలలో అంతరించిపోతున్న కళలను కాపాడేందుకు, కళాకారులను ప్రోత్సహించేందుకు కళాక్షేత్రం నిర్మాణంతోపాటు కళాకారులకు పింఛన్, ఇతర ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. కళలను కాపాడేందుకు నడుం బిగించిందని, తద్వారా వినోదం, మానసిక ఆనందం ప్రజలు పొందేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపిటిసి మారోతు రామారావు, ఎంపిపి కొల్లిరమణమూర్తి, జెడ్పీటిసి కరెడ్ల ఈశ్వరరావు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.