కృష్ణ

మోపిదేవిలో వేద విద్వత్ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, జూన్ 8: మోపిదేవి శ్రీ లలితాత్రిపుర సుందరి బ్రాహ్మణ అన్నదాన ట్రస్టు ఆధ్వర్యంలో చతుర్దశ వార్షికోత్సవం సందర్భంగా వేద విద్వత్ సభ నిర్వహించారు. లోక కల్యాణార్ధం, మానవాళి శ్రేయస్సు కోసం వేద విద్వత్ సభ నిర్వహించినట్లు ట్రస్టు వ్యవస్థాపకుడు కరెడ్ల సుందరశర్మ తెలిపారు. ఈ సభలో చతుర్వేద పారాయణ గావించారు. ఈ కార్యక్రమంలో 100 మంది వేద పండితులను సత్కరించారు. 25 మంది వేద విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షుడు కప్పగంతుల వెంకట సుబ్రహ్మణ్య ఘనాపాఠి, సలహాదారు డి గురునాథ ఘనాపాఠి, వ్యవస్థాపకులు కరెడ్ల సుందర శర్మ, లలితా రాజేశ్వరి దంపతులు, ట్రస్టు కార్యదర్శి పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, కోడూరు విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ, శ్యామలానంద ప్రసాద్, నైడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ తదితరులు పాల్గొన్నారు.