కృష్ణ

ఎస్‌ఐపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచికచర్ల, జూన్ 8: విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐపై ఇద్దరు యువకులు దాడి చేసి గాయపర్చిన ఘటన జాతీయ రహదారిపై కీసర టోల్‌ప్లాజా వద్ద గురువారం జరిగింది. చందర్లపాడు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ గురువారం సిబ్బందితో జాతీయ రహదారిపై కీసర ట్లోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ డ్యూటీ నిర్వహిస్తున్నారు. కంచికచర్లకు చెందిన ఇద్దరు యువకులు తాటుకూరి వెంకటేశ్వరరావు, దినేష్‌లు బైక్‌పై వెళుతుండగా పోలీసులు అపి రికార్డులు చూపాలని కోరారు. వారి వద్ద రికార్డులు లేకపోవడంతో జరిమానా రాస్తుండగా ఇద్దరు యువకులు ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డారని ఎస్‌ఐ దుర్గాప్రసాద్ కంచికచర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువకులను కంచికచర్ల పోలీసు స్టేషన్‌కు తరలించారు. గాయపడిన ఎస్‌ఐ దుర్గాప్రసాద్ నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు.