హైదరాబాద్

లోతట్టు ప్రాంతాలు జలమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 8: హైదరాబాద్ మహా నగరంలోని ఉప్పల్ సర్కిల్‌లో భారీ వర్షం కురిసింది. తెల్లవారుఝామున 4గంటలకు మొదలైన వర్షం భీకరమైన ఉరుములు, మెరుపులతో నగర ప్రజల్ని నిద్రలేపింది. ఒకవైపు కరెంట్ కట్, మరోవైపు భారీ వర్షంతో బయటకు వెల్లలేని పరిస్థితి నెలకొంది. ఉదయం 7.30గంటల వరకు కురిసిన భారీ వర్షంతో ఉదయం బయటకు వెళ్లలేక ఉద్యోగులు, ప్రయాణికులు, విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. వర్షం రాకతో వాతావరణం చల్లబడింది. మూడున్నర గంటల పాటు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి జన జీవనం స్తంభించింది. ప్రధాన రహదార్లతో పాటు కాలనీ రహదార్లలో వర్షం నీరు నిలువడంతో చెరువులను తలపించాయి. గరిష్టంగా 9 సెం.మీ వరకూ వర్షపాతం నమోదైందని సమాచారం. సర్కిల్ పరిధిలోని చిల్కానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్ డివిజన్లలో వర్షం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రామంతాపూర్‌లోని బాలకృష్ణనగర్, కెసిఆర్ నగర్, టివికాలనీ, సాయినగర్, శ్రీరమణపురం, కామాక్షిపురం, శ్రీనగర్‌కాలనీ, హబ్సిగూడ లక్ష్మీనగర్, సాయిచిత్రనగర్, చిల్కానగర్‌లోని శ్రీనగర్‌కాలనీ, రాఘవేంద్రకాలనీ, మల్లికార్జున్‌నగర్, ఉప్పల్ డివిజన్‌లోని కావేరినగర్, ఈస్ట్ స్వరూప్‌నగర్, శాంతినగర్, లక్ష్మినారాయణనగర్ ప్రాంతాలలో భారీ వర్షంతో జలమయమయ్యాయి. హబ్సిగూడ జాతీయ రహదారిలోని జెన్‌ప్యాక్ సాఫ్ట్‌వేర్ సంస్థ, హోండా షోరూం ఎదురుగా వర్షం నీరు నిలిచిపోయింది. బయటకు వెళ్లేందుకు వీలులేక అక్కడే నిలిచిపోవడంతో వచ్చిపోయే వాహనాలు వర్షం నీటిలో చిక్కుకుని ట్రాఫిక్ స్తంభించింది. బయటకు వెల్లలేక గంటల తరబడి నిలిచిపోవడంతో అప్రమత్తమైన జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ విజయకృష్ణ, ఇఇ నిత్యానందం, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జంగయ్య, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో నీటిని బయటకు మళ్లించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రహదారిలో నిలిచిన వర్షం నీటితో భక్తులకు అసౌకర్యం కలుగడంతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని గురువారం మూసివేయక తప్పలేదు. పక్కనే ఉన్న ఎన్‌జిఆర్‌ఐ ప్రహరీ కింద భాగంలో కూల్చివేసి నీటిని బయటకు మళ్లించారు. నీరంతా వెళ్లడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది.
చిల్కానగర్, నాగోల్, ఘట్‌కేసర్ ప్రధాన రహదార్లలో వర్షం నీటిని బయటకు మళ్లించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 8 గంటలకు వర్షం తగ్గడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు. ఇళ్లలోకి చేరిన వర్షం నీటిని ఇంజన్ల సహాయంతో సిబ్బంది బయటకు మళ్లించారు.