మెయిన్ ఫీచర్

గురుదేవోభవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తత్త్వము’ అంటే ఆ సర్వేశ్వరుడే. కనుక
‘తత్త్వ జ్ఞానం’ అనేది పూర్తిగా ఆయన విషయమైన తెలివిడియే. ఆ తత్త్వజ్ఞానాన్ని (అంటే సర్వేశ్వరుడియొక్క ఉనికి గురించిన వివరం) తన తపస్సుతో, అనుభవంతో గ్రహించినవాడే గురువు! ఏ శిష్యుడికి ఏది
అవసరమో తెలిసి, ఆ వ్యక్తి అజ్ఞానాన్ని
తొలగించి, ఆ వ్యక్తికి కూడా
తత్త్వజ్ఞానాన్ని
అందించగలవాడే గురువు!..

‘గురు’ శబ్దానికి ఎన్ని నిర్వచనాలున్నా, వాటి సారాంశం ఒకటే; శిష్యుడికి ఏ విజ్ఞానం అవసరమో దాన్ని ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా అతనికి అందించేవాడే గురువు-అని!
‘సత్’ అంటే అత్యుత్తమమైన అని అర్ధం. ‘సద్గురువులు’ ఇవ్వాళ ఉన్నారా? ఉన్నారు నిన్నటిదాకా వరంగల్లు ‘గురుధామం’లోనూ భీమిలి ‘ఆనందవనం’లోనూ మనతోనే, మన మధ్యనే ఉండి ది.10-6-2015న శివైక్యం చెందిన శ్రీ కందుకూరి శివానందమూర్తి గారే ఆ సద్గురువు!
సాధారణంగా జనం దేవుణ్ణి కొలిచినా, ఒక యోగిని కొలిచినా కోర్కెలు కోరుకుంటారు. దేవుడి విషయం మనం చూడలేం గానీ సిద్ధులు మాత్రం మహిమలు చూపించి ప్రజల్ని సంతృప్తి పరుస్తారు. సద్గురు శివానందుల వారి దగ్గర ఈ మహిమలు ఏవీ లేవు! వారి దగ్గరకు వెళ్లేవారంతా మళ్లీ జన్మ ఎత్తకుండా ఉండేందుకు ఉపాయం చెప్పమనీ, దేశక్షేమం కోసం తామేం చెయ్యాలో సూచించమనీ అడిగేవారే! ప్రధాని వాజ్‌పేయి, అద్వానీ, అబ్దుల్ కలాం వంటివారు అట్టివారిలో ప్రముఖులు. విదేశాల్లో ఉన్న ఆర్తులు (శిష్యులు) ఎందరో లెక్కేలేదు!
‘గురువు’ అంటే ఎవరు? అని చాలామంది శిష్యులు వారిని అడిగారు. దానికి సమాధానంగా ఆయా సమయాల్లో శ్రీ శివానందులు ఇచ్చిన సమాధానాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పుకుందాం.
* * *
‘తత్త్వము’ అంటే ఆ సర్వేశ్వరుడే. కనుక ‘తత్త్వ జ్ఞానం’అనేది పూర్తిగా ఆయన విషయమైన తెలివిడియే. ఆ తత్త్వజ్ఞానాన్ని (అంటే సర్వేశ్వరుడియొక్క ఉనికి గురించిన వివరం) తన తపస్సుతో, అనుభవంతో గ్రహించినవాడే గురువు! ఏ శిష్యుడికి ఏది అవసరమో తెలిసి, ఆ వ్యక్తి అజ్ఞానాన్ని తొలగించి, ఆ వ్యక్తికి కూడా తత్త్వజ్ఞానాన్ని అందించగలవాడే గురువు!...అయితే సమర్ధుడైన గురువు తాను తలచుకుంటే కోర్కెలుకూడా తీర్చగలడు. అయితే ఆ మార్గం ధర్మమార్గం అవ్వాలని కోరతాడు...ఇవాళ దేశంలో అధర్మవర్తనం బాగా పెరిగిపోయింది. మరి, ధర్మమార్గాన చరించాలనుకునే వ్యక్తికి ఆ అవకాశం ఉన్నట్లేనా? అంటే ఉంది.
ధర్మమార్గాన పట్టుదలతో జీవించడమే! దీని ఫలితం తరువాత కాలంలో కనపడుతుంది. పునర్జన్మల సంఖ్య తగ్గుతుంది. త్వరగా పరమేశ్వరుణ్ణి చేరుకుంటాడు. అధర్మంగా జీవించే వారికి ఈ జన్మలో బాగా గడవవచ్చు. కానీ పునర్జన్మల పట్టిక చేంతాడంత పెరిగిపోతుంది. ఫలితంగా అతడు సర్వేశ్వరుణ్ణి చేరుకునేందుకు బాగా ఆలస్యవౌతుంది. అయితే గజాసురుడు, త్రిపురాసురుడుల్లాగా అత్యంత క్రూరంగా అధర్మంగా జీవిస్తే మాత్రం భగవంతుడు అవతారం ఎత్తి సంహరించి తనలో కలుపుకుంటాడు. అహంకార, మోహ, మమకారాలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో అత్యంత క్రూరంగా ఎవరూ ఉండలేరు. కనుక అధర్మ జీవనులు చేంతాడంత పునర్జన్మల వలయంలోపడి ‘పునరపి జననం, పునరపి మరణం’ -అంటూ కొట్టుకోవాల్సి వస్తుంది. ఏది కావాలి, ఇవాల్టి అధర్మ సుఖమా, రేపటి శాశ్వత శాంతా?
‘ప్రపంచంలోని దుఃఖాన్నంతనీ తొలగించగల పుణ్య చర్ముడు ఎవ్వరూ లేడు...దైవీయ లక్షణాలు గల వ్యక్తులు దిగంబరులై పిచ్చివారివలె ఏదో లోకంలో విహరిస్తూ ఉంటారు. వీళ్లు గంగా తీరంలో మనకు కనిపిస్తారు. వీళ్లు యోగులు. మహాత్ములు!..దేవతలు, అణిమాది సిద్ధులు, మంత్రాలు-వగైరాలలో ఏది ఏ శిష్యుడికి ఇవ్వాలో గురువుకు తెలుస్తుంది. అల్లా తెలుసుకోగలిగిన, అంతటి తత్త్వజ్ఞాని అయిన-గురువు, శిష్యులిచ్చే పాదపూజలు, మృష్టాన్నాలు, పల్లకీ ఊరేగింపులు వగైరా ఆశించరు. శిష్యుడి క్షేమమే కోరుకుంటాడు. అభిమానమూ, ప్రేమ, అనురాగమూ..వీటితో శిష్యుడిని ఎప్పుడూ మనస్సులోనే ఆలింగనం చేసుకుంటుంటారు. గురువు కంటికి కనపడకుండా ఉండేది ఏదీ లేదు. న్యూయార్కు నగరంలో అర్ధరాత్రి రహస్యంగా నువ్వు రాసిన ఉత్తరం ఆయన ఇక్కడినుంచే చదివెయ్యగలరు!
మనుష్య రూపంలో ఉన్న ఈశ్వర తత్త్వాన్ని గురువుగా భావించడం మంచిది. ఎందుకంటే, ఆ గురువు మనతో సహజీవనం చేస్తూ మన వలే తప్పు, ఒప్పులు చేస్తూ ఉన్నట్టు కనబడతుతూ, మనల్ని చెయ్యిబట్టి నడిపిస్తూ ఉంటాడు. గురువు తనపై విశ్వాసం ఉన్నవారిని ఎన్నటికీ వదిలిపెట్టడు. ఒకవేళ ఎప్పుడైనా ఒక శిష్యుడు గురూగారూ! మిమ్మల్ని వదిలేస్తున్నాను’ అన్నప్పటికీ అతనిమీద ఆ గురువుకు ఉన్న అవ్యాజమైన ప్రేమ ఇసుమంత కూడా తగ్గదు! అల్లా కోపతాపాలు రానివాడే అసలైన గురువు! అల్లాంటి గురువు లభించడం సాధకుడి (శిష్యుడి) అదృష్టం. పూర్వ పుణ్య ఫలం! ‘గురువు, తన శిష్యుడి కోసం ఎన్నైనా కష్టనష్టాలు అనుభవిస్తాడు- శుక్రాచార్యుడు, బలిచక్రవర్తి కోసం కన్ను పోగొట్టుకున్నాడు. విశ్వామిత్రుడు త్రిశంకుడి కోసం ఎంతో తపస్సు ఖర్చు చేసుకున్నాడు-ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి!
గురువు ఎప్పుడూ మీ క్షేమం గురించే ఆలోచిస్తుంటాడు. అంటే లోకక్షేమం, దేశ క్షేమం గురించి కూడా ఆలోచిస్తుంటాడు!
* * *
శ్రీ శివానందమూర్తి సద్గురువులు బహుముఖేనా ప్రతిభా వంతులు! మూర్త్భీవించిన సనాతన ధర్మమే ఆయన! వేద విజ్ఞానవేత్త, పురాణాలను పుక్కిట పట్టినవారు. వాటిని ఆధునికంగా వ్యాఖ్యానించగల కర్మణ్యులు. సంగీత, కళా, సాహిత్య రంగాల పట్ల అనురక్తులు. ప్రాక్పశ్చిమ దేశయాత్రికులు. అనేక శివాలయాల స్థాపకులు.దేశంలోని అనేకమంది దేశభక్తుల్నీ మేధావుల్నీ ప్రభుత్వం గుర్తించకముందే గుర్తించి సత్కరించి, తన్ను తాను సత్కరించుకున్నట్టు భావించిన మహాపురుషులు. హోమియోవైద్యులు.అనేక గ్రంథ రచయిత. ప్రజల్లో మమేకమైన ప్రజాసేవకులు. ఒక్కమాటలో ఆధునిక యోగి! ఆవ్యక్తినీ ఈ వ్యక్తినీ పట్టుకుని హారతులు, నిలువెత్తు మాలలూ,గుళ్లు గోపురాలూ ఏర్పరిచే వ్యక్తులు యోగిపుంగవుడైన శివానందమూర్తిని ఎందుకు ఆశ్రయించరు? ఎందుకంటే వీళ్లకి కావలసింది కోరికలు తీరడమే. కోరికలే లేని మోక్షం కాదు కనుక! ఆ యోగిత్వ లక్షణం చేతనే శివానందమూర్తిగారు ‘సెక్యులరిజం’ అనే మాటను మనం మన రాజ్యాంగంలోంచి తీసివేసిన మర్నాడు మనదేశం నవనవోనే్మషంగా, సర్వతోముఖంగా ఒక్క ఉదుటున అభివృద్ధి చెందుతుందని, అన్ని వర్గాల వారు మహాశాంతిగా జీవించగలుగుతారని నిర్మొహమాటంగా ఎన్నో వ్యాసాల్లో రాసారు. ఆ సూచనను అమలు పరచడమే మనం ఆయనకు ఇవ్వదగ్గ నివాళి. అంతేకాదు, ‘పరాశరుడు, యాజ్ఞవల్క్యుడు, మనువు-మొదలైన మహర్షులు అందించిన ధర్మం అనేదాన్ని ఇవ్వాళ ఆచరించలేము. కనుక ‘్ధర్మం’ అనే దాని అర్ధం ఇప్పుడు నిర్వచించబడాలి’ అని కూడా వారు అన్నారు.
ఆ వ్యాసాలు చూచే నేను ప్రభావితుడనయ్యాను. పదేళ్ల కిందట వారిని నేను భీమిలిలో కలిసి ‘మీ వ్యాసాలు చాలా స్పూర్తిదాయకంగా ఉన్నాయి’అని అంటే ఆయన, ‘మీవంటి బాధ్యతగల వారి వల్ల అవ్వి ఇంకా జనంలోకి వెళ్లాలి. మీరూ రాయండి’ అన్నారు! ...ఏలూర్లో మా సోదరతుల్యుడు డాక్టర్ గుండు నరహరి శాస్ర్తీ గారింటికి వారు వచ్చినప్పుడు నేను వెళ్లి ఆహ్వానించగానే, వెంటనే బయల్దేరి మా ఇంటికి వచ్చి ఇల్లంతా తిరిగి మా ఇంట్లో అరగంట సేపు గడిపారు. ఫిబ్రవరి 2015న భీమిలిలో నేను ఆయన్ను కలిసి ‘నా అనుష్ఠానం చాలా టైము తీసుకుంటోంది. రాతమీద టైము పెట్టలేకపోతున్నాను. దేన్ని తగ్గించమంటారు’ అని అడిగితే ‘దేన్నీ తగ్గించవద్దు.మీరు రెండూ కొనసాగించడం ఇవ్వాళ దేశావసరం. దేన్ని తగ్గించాలో ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు.. నేను చిరకాలం ఉండాలంటారా!...ఎవడిష్టం ఇది, నాదా, మీదా? దీనిది, ఈ ఉపాధిది! నా జీవుడు నావాడే. నేనే. కానీ ఈ ఉపాధి ఉందే ఇది నాది కాదు. ఎంతకాలమో దానిష్టం!..’ తలవంచడం చేతకాని నేను ఆ రోజున వారికి సాష్టాంగ నమస్కారం చేసాను. నా పుణ్యఫలం! ఆరు నెలలు తిరక్కుండానే జూన్‌లోనే వారు శివైక్యం చెందుతారని నేను కలలో కూడా అనుకోలేదు. వారు జీవించి ఉండడం ఇవ్వాళ దేశానికి ఎంతో అవసరం. ప్చ్, ఒక శుక్ర నక్షత్రం అర్ధాంతరంగా రాలిపోయింది!
శ్రీ కందుకూరి శివానందమూర్తి ఉర్లాం జమీందారుల్లో ఆఖరివారు (శ్రీకాకుళం జిల్లా) అయినప్పటికీ ఆధ్యాత్మికత, గురుపీఠం వారికి ఇంట్లో తాతలనాటి నుంచి వస్తూన్నదే. వీరు 31-12-1928లో వీర బసవరాజు, సర్వమంగళదేవి దంపతులకు జన్మించారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లూను.
నేడు సద్గురు శివానంద మూర్తి వర్ధంతి

-గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు