మంచి మాట

కర్మఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుధిష్ఠిరుడు కురుక్షేత్ర యుద్ధంలో గురువులు, తాతలు, మేనమామలు, హితులు, సన్నిహితులు, సామాన్య ప్రజలు అరువది ఆరు కోట్లమంది మరణించడం వల్ల కలత చెంది మానసిక అస్వస్థతకు గురియైనాడు. భీష్ముడు యుధిష్ఠిరుని మానసిక శాంతికోసం ఉపాఖ్యానాలు, మహాపురుషుల మధ్య జరిగిన సంవాదాలు చెప్పాడు. కాని యుధిష్ఠిరునిలోని ఆలోచన మనస్సునుండి వైదొలగలేదు.
పితామహా! శరతల్పంమీద ఉండి కూడా మాకు ఎన్నో హితోపదేశాలు చేశారు.కాని, అని మళ్లీ బాధపడే ధర్మరాజునుచూచి గౌతమీ-వ్యాధ - సర్ప-మృత్యు-కాలాలమధ్య జరిగిన సంవాదాన్ని చెప్తాను వినమన్నాడు.
గౌతమి యను ఒక వృద్ధ తాపసి కలదు. ఆమె పుత్రుణ్ణి పాము కరవగా అతడు మరణించాడు. ఆమె విచారగ్రస్తురాలైయున్న సమయమున అర్జునకుడను బోయవాడు ఆ పామును బంధించి తీసుకువచ్చి నీ పుత్రుణ్ణి పొట్టన పెట్టుకున్న పాము ఇదిగో. దీనిని నరికి ముక్కలు చేయమందువా? లేక అగ్నిలో పడవేయమందువా? అని ఓదార్పు మాటలను పలికెను.
అర్జునకా! దీనిని చంపరాదు. విడువుము. జరుగుతన్నదానిని ఎవరూ ఆపలేరు. దీనిని చంపడంవల్ల నా పుత్రుడు మళ్లీ జీవించడు. ఈ సర్పము జీవించి ఉండడంవలన నష్టమేమిటి? అన్న గౌతమి పలుకులకు వ్యాధుడిట్లు పలికెను.
దీనిని విడిచిపెట్టినచో ఇంకెందరినో కరుస్తుంది. ఒకదానిని చంపి అనేకులను రక్షించడం మంచిది కదా! అన్నాడు వ్యాధుడు.
గౌతమి సర్పాన్ని చంపడానికి ససేమిరా ఒప్పుకోలేదు.
అప్పుడు బంధించిబడ్డ సర్పం మనుష్య భాషలో యిట్లు పలికెను.
అర్జునకా! నాకీ విషయంలో స్వాతంత్రం లేదు. నన్ను మృత్యువు ప్రేరేపించడంవలన నేనిలా చేశాను. కోపం చేతగాని యిష్టప్రకారం చేసింది కాదు. దీనిలో నా పాపం ఇసుమంతయు లేదు.
నువ్వు ఇతరుల ప్రేరణవలన చేసినా, చేసింది నీవే కదా! మట్టితో కుండ తయారుచేయడానికి చక్రమూ, చక్రము తిప్పే దండము ఎలా కారణమంటారో అలాగే నువ్వు కూడా కారణము. నిన్ను దండించవలసిందే.
కాని ఇతను చనిపోవడానికి నేనుఒక్కణ్ణే కారణం కాదుఅంది సర్పం.
ఇతరులెవరేనా ప్రేరేపించినా ఆ పని చేసినవాడిని నీవే కదా. బాలుణ్ణి చంపిన నిన్ను దండించవలసిందే అని అర్జునకుడన్నాడు.
అప్పుడు సర్పం ఇలా అంది. దక్షణంమీద ఆశతో ఋత్విక్కులు హోమం చేసినా దాని ఫలం వారికి చెందదు. వాళ్ల చేత ఆ పనులు చేయించిన యజమానులకు చెందుతుంది. అందువలన పాపం నాకు చెందదు. వాళ్లిలా వాదించుకుంటూ ఉండగా మృత్యువు అక్కడ ప్రత్యక్షమయ్యింది.
సర్పమా! కాలం నన్ను ప్రేరేపించడంవలన నేను నిన్ను ప్రేరేపించాను. ఈ పాపం నాకూ చెందదు. నీకూ చెందదు. కాలం ఈ జగత్తులోని సమస్త వస్తువులను దానికిష్టం వచ్చినట్లు తిప్పుతూ ఉంటుంది.
పంచభూతాలు, అగ్ని, వాయువు, జలము, పృథ్వీ, ఆకాశము, సూర్యచంద్రులు, విష్ణువు, ఇంద్రుడూ, నదులు, సముద్రములను అన్నింటిని కూడా కాలమే నడిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నేను దోషిని ఎలా అవుతాను. నేను దోషినైతే నీవు కూడా దోషివే.
అట్లాకాదు కాని ఈ దోషానికి కారణం కాలం మాత్రమే అంది సర్పం.
వ్యాధుడు ఇవన్నీ విని సర్పమా నీతోపాటు మృత్యువు కూడా అపరాధియే. మీరిద్దరూ అపరాధులే. నిన్ను వధించవలసిందే.
వాళ్లిలా వాదించుకుంటూ ఉండగా అక్కడకు కాలం వచ్చింది. ఆ ముగ్గురితో ఇలా అంది. ఈ బాలుని మరణానికి నేను గాని మృత్యువు ఈ సర్పం కాని ప్రేరకులం కాదు. ఈ బాలుడు చేసిన కర్మయే ప్రేరకము. అదే ఈతని మరణానికి కారణం. మనమందరం కర్మకు లొంగినవాళ్లమే. అది ఎలా నడిపిస్తే అలా నడవాలి.
అప్పుడు గౌతమి, వ్యాధుడా! కాలం గాని, మృత్యువుగాని సర్పంగాని నా పుత్రుని మరణానికి కారణం కాదు. వీని కర్మయే కారణం. సర్పాన్ని విడిచిపెట్టుము. వ్యాధుడు సర్పాన్ని విడిచిపెట్టాడు.
అందుచేత యుధిష్ఠిరా!దుఃఖించవద్దు. కాలమే దీనికంతటికీ కారణమని భీష్ముడు చెప్పిన సంవాదం విని యుధిష్ఠిరుని మనస్సు తేలిక పడింది.

-ఎ.లక్ష్మీపతిరావు