కరీంనగర్

మోదీ దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామడుగు, జూన్ 9: ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి అరెస్ట్‌ను నిరసిస్తూ శుక్రవారం రామడుగు మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు నాగి శేఖర్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడి దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం శేఖర్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌లో కాల్పులు జరిపి రైతులను పొట్టనబెట్టుకున్న నేపద్యంలో పరామర్శించడానికి వెళ్లిన రాహుల్‌ను మోడి సర్కార్ అక్రమంగా అరెస్ట్ చేసిందన్నారు. నిరకుంశంగా వ్యవహరిస్తూ నిజాన్ని నిర్భయంగా నిలదీసే వారిని మోడి సర్కార్ అణచివేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోల రమేష్, మండల శాఖ అధ్యక్షులు పులి ఆంజనేయులు, నేరెళ్ళ భాపిరాజు, పంజాల శ్రీనివాస్, సముద్రాల సత్యనారాయణ, బొమ్మరవేని తిరుపతి తదితరులు ఉన్నారు.