మెదక్

నల్ల్లా గుంతలో పడి బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివపేట, జూన్ 9: ఆడుకుంటున్న యేడాదిన్నర బాబు నల్ల గుంతలో పడి మృతి చెందిన సంఘటన సదాశివపేట మున్సిపల్ పట్టణంలోని 1వ వార్డులో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఎస్సీ కాలనికి చెందిన రమేష్, సునితల రెండవ సంతానమైన యేడాదిన్నర వయస్సు గల శ్రీ్ధర్ ఆడుకుంటూ ఇంటిముందున్న నల్ల గుంతలో పడిపోయాడు. ఎవరు గమనించకపోవడంతో శ్వాస ఆడక మరణించాడు. అరగంట అనంతరం తల్లిదండ్రులు చూసే సరికి నల్ల గుంతలో పడిపోయిన బాబును వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. ఈ విషయమై సదాశివపేట పోలీసులను సంప్రదించగా తమకేలాంటి పిర్యాదు అందలేదన్నారు.