కృష్ణ

ఆగిరిపల్లిలో సభలకు అనుమతి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగిరిపల్లి, జూన్ 9: మండల కేంద్రమైన ఆగిరిపల్లి గ్రామంలో ఎటువంటి సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వలేదని, గ్రామం 144 నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయని ఏలూరు రేంజ్ డిఐజి పివిఎస్ రామకృష్ణ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆగిరిపల్లిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు స్టేషన్లో డిఐజి రామకృష్ణ విలేఖరులతో మాట్లాడుతూ ఆగిరిపల్లి గ్రామంలో సభలు, సమావేశాలకు ఎటువంటి అనుమతులు లేవని, 144 నిషేధాజ్ఞలతో పాటు 30 సిఆర్‌పిఎఫ్ సెక్షన్లు అమలులో ఉన్నాయని చెప్పారు. ప్రశాంతం ఉన్న ఆగిరిపల్లి గ్రామంలో సమావేశం, సభలు నిర్వహిస్తున్నట్లు కొంతమంది ప్రచారం చేశారని, ఇటువంటి సభల వల్ల గ్రామంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. వీటికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. సభలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ కొంతమంది దరఖాస్తులు చేసుకున్నారని, అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ఈ సమావేశంలో ఎడిషనల్ ఎస్‌పి రెడ్డి, డిఎస్‌పి వి శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆగిరిపల్లి గ్రామంలో దళితులపై అగ్రవర్ణాలవారు దాడులు ఏమాత్రం చేయలేదని, దళిత వర్గాలకు చెందినవారే దాడులు చేసుకుని గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తీసుకువస్తున్నారని జెఎసి నాయకులు ఆరోపించారు.