హైదరాబాద్

ఐటి కారిడార్‌లో పోలీసుల తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూన్ 9: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటి కారిడార్‌తో పాటు షాపింగ్ మాల్స్‌కి ఉగ్రవాదులతో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరించడంతో తనిఖీలు చేశారు. జనం రద్దీగా ఉండే ప్రదేశాలపైన దాడులు జరగవచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో సైబరాబాద్ సెక్యూరిటీకి చెందిన బిడి టిమ్‌లు, డాగ్ స్క్వాడ్ బృందాలు క్షణంగా తనిఖీలు చేశాయి. మాల్‌లోనికి వచ్చేవారితో పాటు ఉద్యోగులను, అనుమానితులను విచారించి అనంతరం విడిచి పెట్టారు. ఐటి కారిడార్‌లోని ప్రధాన రహదారులపైన చెక్‌పోస్టుల వద్ద పోలీసులు నాకాబందీ నిర్వహించారు. భారీగా పోలీసులు రోడ్డుపై మోహరించి తనిఖీలు నిర్వహించడంతో ఏమి జరుగుతుందో తెలియక ఉద్యోగులు ఆదోళన చేందారు. ఐటి సెక్టార్‌లో పని చేసే ఉద్యోగులకు శుక్రవారమే వీక్ ఎండ్ ప్రారంభమవుతుంది. దానికి తోడు వీక్ ఎండ్‌లో త్వరగా పని ముగించుకుని బయటకు వెళ్లాలని ఉద్యోగులు ప్రయత్నిస్తుంటారు. పోలీసులు తనిఖీలుతో ట్రాఫిక్ జామ్‌లు కావడంతో ఉద్యోగులు ఇబ్బందుపడ్డరు. పోలీసులు మాత్రం నిఘా వర్గాల హెచ్చరికలు సాధారణంగా వస్తువుంటాయని, దాంతో పాటు తనిఖీలు నిత్యం ఏదోక ప్రాంతంలో నిర్వహిస్తుటామని పోలీసు అధికారులు తెలిపారు.