చిత్తూరు

మహిళల ఆత్మరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 9: జిల్లాలో మహిళల ఆత్మరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడించారు. శుక్రవారం తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మహతి ఆడిటోరియంలో మహిళ-బాల రక్షక్ టీం ద్వారా గుర్తించిన అనాధ బాలలను పాఠశాలలకు పంపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిలో అనాథపిల్లల సంరక్షణకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. భిక్షాటన చేసే పిల్లలను గుర్తించి వారికి విద్యా బుద్ధులు నేర్పేందుకు చర్యలు చేపడతామన్నారు. ఇందుకు విద్య, కార్మిక, ఐసిడిఎస్, ఆరోగ్య, సంక్షేమ, పోలీస్ శాఖలతోపాటు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటామన్నారు. బాలకార్మికులను గుర్తించి వారికి విద్యపట్ల ఆసక్తిని కలిగించే కార్యక్రమాలను పెంచుతామన్నారు. జిల్లాలో లక్ష 56వేల మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారన్నారు. వారి ఆత్మరక్షణకు కరాటే నేర్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. బాలబాలికల చేత చాకిరి చేయించే హోటళ్లు, ఇతర వ్యాపారస్థులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పిఓసిఎస్‌ఓ 2012 చట్టం కింద పిల్లలపై లైగింక వేధింపు ఒక నేరమన్నారు. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా జిల్లాలో 12500 మంది పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి చర్యలు తీసుకుంటునామన్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి ఆధ్వర్యంలో 250 మంది పిల్లలను మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అనాథ పిల్లలను గుర్తించి వారిని పాఠశాలకు పంపించడమే కాకుండా వారికి అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించడం అభినందనీయమన్నారు. అది తన చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉందన్నారు. అమ్మా నాన్నలేని అనాథ పిల్లలను బాలరక్షక్ టీంల ద్వారా గుర్తించి వారికి ఉజ్వల భవిష్యత్ కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బాలరక్షక్ టీంలు ఏర్పాటు చేస్తామన్నారు. అర్బన్ ఎస్పీ జయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కీర్తి, యునిసెఫ్ ప్రతినిధి మురళి, అధికారులు పాల్గొన్నారు.