సబ్ ఫీచర్

సూపర్ బైకర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎత్తయిన కొండలు మధ్య బైక్ మీద ప్రయాణం అంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి హిమాలయ పర్వతాలను బైక్ మీద చుట్టేసింది మూడు పదుల సారాకశ్యప్. గూగుల్ కంపెనీలో ఉద్యోగానికి సైతం గుడ్‌బై చెప్పి సాహసమే ఊపిరిగా భావించే కశ్యప్ హిమాలయాలను బైక్‌పై అధిరోహించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. చండీగఢ్‌కు చెందిన ఈ చిన్నది ఈ బైక్ రైడింగ్‌ను తొంభై ఏళ్లు వచ్చే వరకు కొనసాగిస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. దశాబ్ద కాలం నుంచి బైక్ నడుపుతున్నా పోటీల్లో మాత్రం గత మూడేళ్ల నుంచే పాల్గొంటున్న కశ్యప్ ఇప్పటి వరకు ఎనిమిది ర్యాలీల్లో పాల్గొన్నారు. రెండు సార్లు బైక్ మీద దేశాన్ని చుట్టేసింది. ‘బైక్ రైడింగ్ మగవాళ్లే చేస్తారని అనుకోవద్దు. ఆడవాళ్లు కూడా చేయగలరు అని నిరూపించగలిగాననే సంతృప్తి ఉంది’ అని ఆమె చెబుతుంటారు. 2015లో మొదటిసారి బైక్ మీద హిమాలయాలకు వెళ్లినపుడు కశ్యప్ ర్యాలీలో ఇరవై నెంబర్ స్థానంలో ఉన్నారు. ఇపుడు 70 మంది వెళితే అందులో 12వ స్థానంలో నిలిచారు. అంతేకాదు రాయల్ ఎన్‌ఫీల్డ్ గాళ్‌గా పిలుచుకునే స్థాయికి ఆమె చేరుకుంది. ‘ఒకసారి ప్రయాణంలో బైక్‌తో సహా 30 అడుగుల లోయలోకి పడిపోయాను. దెబ్బలు బాగా తగిలాయి. వాటిని లెక్కచేయకుండా ప్రయా ణం కొనసాగించటం గర్వంగా ఉండేది’ అని గతానుభవాన్ని గుర్తు చేస్తూంటారు. బైక్ రైడింగ్ ప్రారంభించినపుడు చుట్టుపక్కలవారు ఆమె తం డ్రితో ‘మీ అమ్మాయి ఏదో ఒక రోజు ప్రాణాలు పోగొట్టుకుని శవంగా రావటం ఖాయం’’ అని భయపెట్టేవారని, అలా చనిపోతే ఆకాశంలో నక్షత్రంలా తోటివారికి వెలుగునిస్తుందని’ తన తండ్రి వారితో అనటం తనకు స్ఫూర్తినిచ్చేదని చెబుతారు. ఒకప్పడు ‘పిక్నిక్ రైడర్’ అని పిలిచే ఆమెను నేడు ‘సూపర్ బైకర్’ అని పిలవటం ఆమె ప్రతిభకు దర్పణం. దేశ సరిహద్దుల పొడవు వెడల్పు, చుట్టుకొలతలు కొలవాలని తహతహలాడే కశ్యప్ బైక్ రైడింగ్ ర్యాలీలో పాల్గొన్నపుడల్లా ఆమె ను గుర్తుపట్టిన ప్రజలు ఎంతో ఆదరణగా పలకరిస్తూంటారు.