ఆటాపోటీ

పాప్‌కార్న్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షర్జీల్ ఖాన్ ఎఫెక్ట్!
* పాకిస్తాన్‌పై ఓపెనర్ షర్జీల్ ఖాన్ జట్టులో లేకపోవడం తీవ్ర ప్రభావాన్ని చూపింది. గత ప్రపంచ కప్ నుంచి ఇప్పటి వరకూ జరిగిన వనే్డల్లో అత్యంత వేగంగా పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రెండో స్థానంలో ఉన్న షర్జీల్‌పై ఫిక్సింగ్ కేసు కొనసాగుతుంది. దీనితో పిసిబి అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆరంభంలోనే ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేయగల సతాతవున్న షర్జీల్ సేవలు అందుబాటులో లేక పాక్ ఇన్నింగ్స్ బలహీన పడింది.

అజర్ అలీ నిర్లక్ష్యం..
* ఓపెనర్ అజర్ అలీ 50 పరుగులు సాధించి, పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, 41 ఓవర్లలో 289 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి తన వికెట్ కీలకమన్న ఆలోచన లేకుండా నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. ఒకసారి క్యాచ్ అవుట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న అతను ఆతర్వాత జాగ్రత్త పడకుండా, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో యాదాలాపంగా షాట్‌కు ప్రయత్నించి, హార్దిక్ పాండ్యకు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. క్రీజ్‌లో నిలదొక్కుకున్న అతను మూడో వికెట్‌గా వెనుదిరగడంతో పాక్ విజయావకాశాలు చేజారిపోయాయి.

మాలిక్ త్యాగం ..
* ఓ సీనియర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ రనౌట్ పాక్‌ను దారుణంగా దెబ్బతీసింది. నిజానికి మాలిక్ స్థానంలో మహమ్మద్ హఫీజ్ రనౌట్ కావాల్సి ఉండింది. అయితే, అంతకు ముందే బ్యాటింగ్‌కు దిగి, ధాటిగా ఆడుతున్నాడన్న ఉద్దేశంతో మాలిక్ రిస్క్ తీసుకొని, సకాలంలో క్రీజ్‌లోకి చేరేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కానీ జడేజా సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో మాలిక్ వెనుదిరిగాడు. హఫీజ్ కోసం మాలిక్ త్యాగం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. హఫీజ్ 43 బంతుల్లో 33 పరుగులు చేసి అవుటయ్యాడు. 9 బంతుల్లోనే 15 పరుగులు సాధించిన మాలిక్ మరికొంత సేపు క్రీజ్‌లో ఉండివుంటే, పాక్ పరిస్థితి అంత దారుణంగా మారేది కాదు. - సత్య