ఆటాపోటీ

వ్యూహాత్మకంగా భారత్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి నుంచి భారత్ వ్యూహాత్మకంగా ఆడింది. అనుకున్నది సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తొందరపాటును ప్రదర్శించకుండా నింపాదిగా బ్యాటింగ్ చేశారు. మొదటి ఐదు ఓవర్లలో 4.8 సగటుతో టీమిండియా 27 పరుగులు చేయగలిగింది. పది ఓవర్లు ముగిసే సమయానికి దాదాపుగా ఇదే తీరును కొనసాగించి 46 పరుగులు చేసింది. కోహ్లీ బృందం అనుకున్నది అనుకున్నట్టు ఆచరణలో పెట్టడానికి పాకిస్తాన్ పసలేని బౌలింగ్ సహకరించింది. ట్రంప్ కార్డ్‌గా ఉపయోగపడతాడనుకున్న ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ఆరంభంలో మెరుపు బంతులతో అదరగొట్టినా, అదే స్థాయిలో నిలకడగా రాణించలేకపోయాడు. తన తొమ్మిదో ఓవర్ మొదటి బంతి వేస్తూ కిందపడి, ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయాడు. అమీర్‌పై భారం వేసిన పాక్ భంగపడింది.