ప్రేమ షికార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న గోవా సుందరి ఇలియానాకు ప్రస్తుతం బాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు లేవు. సౌత్‌లో వున్న క్రేజ్‌ను కాదనుకొని బాలీవుడ్‌లో వెలగాలని తెగ ఆశపడి అక్కడికి వెళ్లింది. కానీ వచ్చిన రెండు మూడు అవకాశాలు కూడా ఈమెకు బాలీవుడ్‌లో నిలదొక్కుకునేందుకు ఉపయోగపడలేకపోయాయి. పోనీ గ్లామర్‌తో షాక్ ఇద్దామన్నా పలువురు భామలు ఆమెకంటే ముందే ఉన్నారు. దాంతో ఇలియానాకు ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దాంతో అడపా దడపా హాట్ హాట్ ఫొటో షూట్‌లంటూ హంగామా చేస్తోంది. పైగా ఇల్లీ బేబీ లవరే ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అవ్వడం ఇందుకు కలిసివచ్చింది. ఇప్పటికే ప్రియుడు ఆండ్రూ నీబ్రోస్‌తో జోరుగా షికార్లు చేస్తున్న ఇలియానాపై బాలీవుడ్‌లో గుసగుసలు ఎక్కువయ్యాయి. చేతిలో ఎలాగూ సినిమాలు లేవు కాబట్టి ప్రియుడితో షికార్లు చేస్తూనే ఉంది. వీరిద్దరి వ్యవహారంపై వస్తున్న పుకార్లు అంతా ఇంతా కాదు. పెళ్లి విషయంలో మాత్రం వీరిద్దరూ స్పందించకపోవడం మరింత చర్చకు తావిస్తోంది.