పరిశ్రమకు దిక్సూచి దాసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చిత్ర పరిశ్రమలో గుండెకాయలాంటి దాసరి దూరమవ్వడం సినిమా పరిశ్రమకు తీర్చలేని లోటు. ఆయన ఉంటే కార్మికులతోపాటు నటీనటులకు, దర్శక నిర్మాతలకు ఓ భరోసాగా నిలిచేవారు. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది అని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఘంటా శ్రీనివాసరావు తెలిపారు. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు సంతాప సభ శనివారం సాయంత్రం హైదరాబాద్ ఫిలిం చాంబర్ హాల్‌లో జరిగింది. కార్యక్రమానికి పలువురు చిత్ర ప్రముఖులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగు సినిమాకు దిక్సూచిలాంటి తన గురువు దాసరి నారాయణరావు లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని, కొత్తవారికి అవకాశాలివ్వడంలో ఆయన ముందువరుసలో నిలిచేవారని నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. సినిమాల్లో నటించడానికి చెన్నై వెళ్లిన తనకు చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో ఆదుకుని అవకాశాలు కల్పించారని, అదేవిధంగా ఇప్పుడున్న దర్శక నిర్మాతలు కూడా కొత్త తరానికి అవకాశాలు కల్పించాలని, అదే ఆయనకు మనమిచ్చే నివాళి అని తెలిపారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వర్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కష్టంలో వున్న ఎవ్వరైనా సరే మొదటగా తలుపు తట్టేది దాసరి ఇంటి తలుపునేనని, ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఆయన లేకపోవడం అందరికీ తీరని లోటుగానే మిగిలిందన్నారు. 24 ఫ్రేమ్స్‌లో తనకంటూ ఓ శైలి ఏర్పరచుకొని దర్శకుడికి గొప్ప గౌరవాన్ని ఆపాదించారని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు తెలుగు చిత్ర పరిశ్రమ తరలడానికి కృషిచేసిన ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరని, ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, భర్తీ చేయలేనిదని నటుడు చిరంజీవి అన్నారు. ప్రస్తుతం పరిశ్రమలో అటువంటి అన్ని రంగాలలో నిష్ణాతుడైన వ్యక్తి ఎవరూ లేరని, ఆయన ఆచరించిన పలు సూత్రాలను దర్శక నిర్మాతలు పాటించి ఆయన అడుగుజాడల్లో నడవాలని చిరంజీవి కోరుకున్నారు. సురేష్‌బాబు, జి.ఆదిశేషగిరిరావు, రేలంగి, సి.కల్యాణ్, వేణుమాధవ్, సురేష్ పాల్గొని దాసరితో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.