దక్షిన తెలంగాణ

తన దాకా వస్తే..! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య రైళ్లల్లో రద్దీ బాగా పెరిగింది. ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అంతమాత్రం చేత భారత రైలు, వారి సేవలు ఘనంగా ఉన్నాయని కాదు. ‘స్వచ్ఛ భారత్’, స్వచ్ఛ భారత్’ అని గొంతు చించుకునే ప్రభుత్వాలు రైలు పెట్టెల్లో స్వచ్ఛతను పాటిస్తున్నాయని కాదు. అధికారులు చెప్పినట్లు ఉద్యోగులు వింటారని కాదు!
పోలీసులు బందోబస్తు ఉన్నా జరిగే దొంగతనాలు జరగడం లేదని కాదు. ఉద్యోగుల నిర్లక్ష్యంతో రైలు యాక్సిడెంట్లు జరిగి అమాయక ప్రయాణికులను పొట్టన పెట్టుకోవడం లేదని కాదు. మామూలు పనికిమాలిన వ్యాపార సంస్థల వలె ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకొని తత్కాల్, ఆపత్ తత్కాల్ వంటి పేర్లతో దోపిడీ చేయడం లేదని కాదు. ఇవన్నీ ఇలా ఉంటే ‘గరీబ్థ్’్ర పేరుతో నడుపుతున్న గరీబులకు అత్యంత అందుబాటులో ఉన్నాయని కాదు.
మరైతే రైలు కోసం ప్రయాణికులు ఎందుకు ఎగబడుతున్నట్లు!? ప్యాసింజరు రైలు ఛార్జీలకు, బస్సు ఛార్జీలకు నాలుగు రెట్లు పైన తేడా ఉందన్న ఒకే ఒక కారణం. నేను ఆ ప్రజల్లో, ప్రయాణీకుల్లో ఒకడిని కాబట్టి. ఒకసారి ఆదా చేసి చూద్దాం అని ఆలోచంచి రైలు టిక్కెట్టు కొనుక్కుని నేనెక్కాల్సిన రైలు కోసం ఎదురు చూస్తూ కూచున్నాను. నా బుర్ర దేశకాల, మాన, పరిస్థితుల గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. దాని ఆలోచనా ధోరణే ఇదంతా.
‘నమస్కారం సార్!’
తిరిగి చూశాను. అతడు మా ఆఫీసుకు తరచుగా వచ్చే శివయ్య.
‘నమస్కారం!’ ఎక్కడికి ప్రయాణం’? ప్రశ్నించాను. ‘హైదరాబాద్ మీరింకా డ్యూటీ చేస్తున్నారా?’ అడిగాడు ఆసక్తిగా శివయ్య.
‘రిటైర్ అయి మూడేళ్లయింది. మొదటి సారి హైదరాబాద్ వెళ్లడానికి రైలు ప్రయాణం చేద్దామని ఇలా వచ్చాను’. చెప్పాను ముక్తసరిగా.
‘అయితే మనకు ‘బోర్’ కొట్టకుండా మాట్లాడుకుంటూ రైలు ప్రయాణం చేయవచ్చు అన్నాడు సంతోషంగా శివయ్య.
రద్దీల్లల్లో ఒకే సీటు దొరికినా ఇద్దరం కలిసి కూచోవచ్చు. ఆ రైలుకోసం ఎదురు చూస్తున్న జనాన్ని చూసి ముందుగానే ఓ బాణం వేశాను..ఇది మన మధ్య ఒప్పందంలాంటిదన్న భావం స్పురించేట్టు.
రైల్వేవాళ్ల అనౌన్స్‌మెంటు, ముక్కుతూ, మూల్గుతూ రైలు రావడం. తిరుపతిలో దర్శనానికి ‘క్యూ’కట్టిన భక్తుల్లా, వేములవాడ జాతరలో భక్తజనంలా రైలు చుట్టుముట్టారు జనం. ఎలాగోలా రాసుకుని,పూసుకుని రైలు డబ్బా ఎక్కాం శివయ్య,నేను ఎక్కడ ఖాళీ సీటు కనిపించలేదు. హైదరాబాద్ వరకు నిలబడే ప్రయాణించాలి అనుకుంటూ నిట్టూర్చాను నేను. ఎక్కడైనా తెలిసిన ముఖం కనబడకపోతుందా అని పరిశీలించసాగాడు శివయ్య.
ఆ రైలు పెట్టె భారతదేశానికి ప్రతీకలా కనిపించింది నాకు. మన దేశంలో కావలసినంత సంపద ఉంది. కొద్ది మంది చేతుల్లో పక్కవాడికి సాయం చేసే సుగుణమే ఉంటే మన దేశంలో కూటికి లేని వాడే ఉండడేమో అలాగే రైలు పెట్టెలో సీట్లు నలుగురికి బదులు పది మంది కూచున్నా సరిపోతాయి. కానీ, రైలు వచ్చేవరకు ఒక సీటైనా దొరికితే చాలనుకున్న ప్రయాణీకులకి, సీటు దొరకగానే మొత్తం తనకే కావాలని, పక్కవాడికి సీటిస్తే తన సొమ్మేపోయినంత బాధ.
శివయ్య అందరిని అడిగి లేదనిపించుకుని, కిటికీ పక్కన నిలబడ్డాడు.
మన ప్రజల మనస్తత్వం తెలిసిన నేను ఎవరినీ అడిగి లేదనిపించుకోదలచుకోలేదు. శివయ్య మాత్రం అందరినీ అడిగి నోరు పారేసుకుంటున్నాడు. ఇంతలో ఓ అద్భుతం జరిగింది.
శివయ్య నిలుచున్న సీటు ఖాళీ కావడం, వెంటనే శివయ్య ఆ సీటును ఆక్రమించడం జరిగింది. బాధనంత మరచిపోయి చేతులు,కాళ్లూ బారా చాపి, కిటికీ పక్క సీటులో ఆసీనుడయ్యాడు శివయ్య. నాకే సీటు దొరికినంత సంబరపడ్డాను నేను. అప్పటిదాకా పక్క పక్కనే నిలబడి బాధననుభవించిన శివయ్య తన సీట్లో కొంచెం జరిగి, నాకు సీటు ఇవ్వకపోతాడా అనుకుని.. ఒకటి రెండు స్టేషన్లు దాటినా స్పందించకపోవడంతో నేనే అడిగాను. కొంచెం జరిగి నాకు సీటివ్వవచ్చు గదా అని. అతని సమాధానంతో నా బుర్ర తిరిగిపోయింది. ఇప్పటిదాకా నిలబడి కాళ్లు గుంజుతున్నాయి. నిద్రవస్తోంది అంటూ నా వైపు చూడకుండా నిద్రలోకి జారుకున్నాడు శివయ్య. తనదాకా వస్తేగాని అసలు వ్యక్తిత్వం బయటపడదు!.. ఆదర్శాన్ని ఆచరించడం అంత తేలికకాదు.

- గరిశకుర్తి రాజేంద్ర కామారెడ్డి సెల్.నం.9493702652