నెల్లూరు

స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగురోడ్ల కూడలిలో కథ బాగుంది
గతవారం మెరుపులో కావేరిపాకం రవిశేఖర్ అందించిన నాలుగురోడ్ల కూడలిలో కథ చాలా బాగుంది. సమాజంలో పెద్దమనుషులుగా చలామణి అయ్యే వారి నిజస్వభావాలు ఎలా వున్నాయి అనే అంశం ఆధారంగా రూపొంచిందిన కథ చివరి వరకు బాగా సాగింది. కథను మొదటి నుంచి కూడా ఆసక్తికరంగా మలిచారు. సుబ్రహ్మణ్యస్వామి, స్వామినాయుడు అసలు రంగును చూసి అవాక్కయ్యాం. నిజంగా పెద్దమనుషులు అంటే సమాజంలో ఎంతో గౌరవం, మర్యాద ఉంటాయి కానీ కొంతమంది పెద్దమనుషుల ముసుగులో అనేక వేషాలు వేస్తుంటారు. నేటి సమాజంలో జరిగే పరిమాణాలకు దగ్గరగా వున్న కథను అందించిన రచయిత కావేరిపాకం రవిశేఖర్‌కు ధన్యవాదములు.
- కరీముల్లా ఖాదర్‌బాషా, ఉదయగిరి
- అమలప్రియ, తిరుపతి

నీటి ఆత్మకథ సూపర్
కంచనపల్లి ద్వారకానాథ్ గారి హృదయపూర్వక అభినందనలు. నిజంగా నీరు లేని మనం లేం. కానీ నేడు ఆ నీటికి దుర్భరపరిస్థితి దాపరించింది. దానిని పలురకాలుగా కాలుష్యానికి గురిచేస్తున్నాం. రచయిత నీటి ఆవేదనను గొప్పగా వర్ణించారు. నీటి వలన కలిగే ప్రయోజనాలతో పాటు మనం చేస్తున్న నష్టాన్ని గురించి కూడా బాగా వివరించారు. గొప్ప సందేశాత్మక కవితను అందించిన ద్వారకానాథ్ గారికి అభినందనలు.
- హేమప్రియ, గూడూరు
- తోట పెంచలమ్మ, పీలేరు
- యాకసిరి మస్తానయ్య, నాయుడుపేట