నెల్లూరు

తాతయ్య బడి (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాతయ్య బడి

ప్రచారాలు లేవు
ఆర్భాటపు పటాటోపాలు లేవు
నమ్మించడాలు లేవు
నమ్మబలకడాలు లేవు.
వల పన్ని స్వాగతించే
తెగువల తెంపులు అసలే లేవు
అయినా మా బడి
సామాన్యుల నుండి అసామాన్యులను
తయారు చేసింది
మట్టి నుండి మాణిక్యాలను
అందించింది.
రాళ్ళ నుండి రత్నాలను ఇచ్చింది
మొండి గోడల మధ్యే
మహోన్నత భావాలతో నిలచింది.
తపోవాటికలను తలపించే
తాటాకు పందిళ్ల కిందనే
తపస్సులా శ్రమించింది.
నిగర్విలా నిలబడింది
సగర్వంగా తలెత్తుకొంది
నిబద్ధతో
నిలువెత్తు వ్యక్తిత్వాలకు
భాష్యాలు చెప్పింది.
చదువు కన్నా ముందు
చదువుకోవడంలోని గొప్పతనాన్ని
చెప్పింది.
వల్లించే నీతులకన్నా
వ్యవహరించే నడతకే
పెద్ద పీట వేసింది.
విలువలు లేని విద్య
పరిమళించదన్న భావాన్ని
పిల్లల్లో పాదు కొల్పింది.
దూరపు చదువులనైనా
దారి తప్పని వ్యక్తిత్వాలతో
లక్ష్యాల దరిని చేర్పింది.

డాబూ దర్పాలతో
స్వార్థపు కోణాల నడుమ
ఒంటరి భయాల మధ్య
శక్తికి మించిన లక్ష్యాలతో
కుంగదీసిన చదువులు కావవి
సామాజిక సత్సంగాల నడుమ
కుటుంబపు అనుబంధాల మధ్య
ఎదగనిచ్చిన చదువులు మావి
కంఠంలో నిలచిపోయే
కంఠస్థపు చదువులు కావవి
ఎదలోకి సాగి మదిని వెలిగించిన
చదువులు మావి

అయ్యవారికి చాలు అయిదు వరహాలు
పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు
అంటూ పల్లె వీధుల్లో సాగిన
వేడుకైన సంబరాలు మావి
ప్రేమ పూర్వక హృదయ స్పందనలు
ఆనాటి గురు శిష్యుల అనుబంధాలు
తాడిత హృదయ వేదన భరితాలు
నేటి గురు శిష్యుల వైరుధ్యాలు
పొంతన లేని - పొసగని పదం - వ్యాపారం
అయింది నేడదే చదువుకు - పర్యాయపదం
చదవంటే - అది ఓ మనోదీప్తి
ఓ సామాజిక ప్రయోజకత్వం
ఓ పారమార్థిక జీవిత సత్యం
ఓ విలువల పరిపోషకత్వం
ఓ వ్యక్తిత్వపు మణిభూషణం
ఓ సద్భావనల సముద్భావం
వెరశి
సమాహరించిన శాంతి సుమాల
మానవ కల్యాణపు ప్రగతి తోరణం
---
దరి చేరిన మనవడితో నుడివిన
ఓ తాతయ్య
నిర్వేదపు మది పలుకులు
కావాలి అవి
నేటి తరాలకు కనువిప్పులు
ఆపై తరాలకు కనువిందులు

- కె.రవీంద్ర బాబు పాకాల
9052778988

వందనాలు...

శతకోటి వందనాలు
అర్రులుజాచిన ఆకలిదేవత
ఆన్యాయంగా కౌగిలించుకొన్న
పేదవాడి పస్తుల పేగులు
మెతుకు కోసం మెలికలు దిరిగిపోతూ
అవిశ్రాంతంగా
‘అమ్మా’ అని ఆక్రోశిస్తూ ఉంటే
వయసునైనా ఒకసారి కనె్నత్తి జూడకుండా
వదిలించుకొని ముందుకుపోతే
వర్ధమాన సమాజానికి వందనాలు.
దేవుడిచ్చిన దేహానికి
దేదీప్యమానమైన దుమాలాలు లేకపోయినా
దిగుముల కన్పించకుండా దాచుకోను
దిక్కు లేక దీనంగా పాతగుడ్డకై ప్రార్థిస్తూ ఉంటే
పట్టరాని అసహ్యంతో
తలప్రక్కకు తిప్పుకొని
తాకను సరేసరి, తలపైకెత్తి చూడనూ
అసహ్యించుకొని
తరిమి తలుపేసుకొనే
తాత్వికమూర్తులకు వందనాలు.

చలికాలం చచ్చేట్టు చంపుతూ ఉంటే
తలదాచుకోను చోటులేక
వీధిపంచలోకి విసిరేయబడ్డ మనిషిని జూచి
ఏం చేస్తున్నావిక్కడ వెళ్లు బయటికని
విరోధిలా తరిమేసి
శీతల యంత్రాల చిక్కటి పొరల్లోకి
చిరస్థాయిగా నేనిలానే ఉంటాననుకొని నడిచే
అహంకారపు ఆదర్శమూర్తులకు
వందనాలు, శతకోటి వందనాలు....

పచ్చా పెంచలయ్య
చరవాణి : 9912822341

తస్మాత్ జాగ్రత్త..!

ఆడపిల్లలు - అవనికి వెలుగులు
అరవిరిసిన విరిజల్లులు - జాతికి దివ్వెలు
తనువిచ్చి - తల్లిగా!
మనసిచ్చి - నెచ్చెలిగా! మమతల
కల్పవల్లిగా! ఇలలో - ఇలవేల్పుగా!
సకల జనులను - తన ప్రేమామృత
దృక్కులతో - తరింపచేస్తున్న - ఓ స్ర్తిమూర్తీ!
మీకు శతకోటి - వందనాలు
వీరవనితగా! ఝాన్సీలక్ష్మీబాయ్!
కరుణారసమూర్తిగా! మదర్‌థెరిస్సా!
రాజకీయ దురంధురాలుగా!
ఇందిరాగాంధీ!
వీరంతా మహిళారత్నాలే కదా! ఇలా!
ఎందరో - వీర, ధీర - పతివ్రతామణులు
పుట్టిన పుణ్యభూమి - ఈ వేదభూమి
మహిమాన్వితమైనది - మన భరతభూమి
అలాంటి - పవిత్రభూమిలో - స్ర్తిలపై
అవాకులు - చవాకులు -
బూతుకారుకూతలు
కూసే - సంస్కారహీనులారా!
నోరును అదుపులో - ఉంచండి
పురుషాహంకారానికి - చుక్కపెట్టండి
లేకుంటే - నిర్భయచట్టం - మీకు
శ్రీకృష్ణ జన్మస్థానం - చూపిస్తుంది
తస్మాత్ జాగ్రత్త! సంస్కారవంతులై
నవసమాజం వైపు నడవండి
భరతమాత ముద్దుబిడ్డలుగా!
వెలుగొందండి
దేశ గౌరవాన్ని - నిలబెట్టండి

- కొడవలూరు ప్రసాదరావు,
గూడూరు
చరవాణి : 8500757622