నెల్లూరు

సుఖాంతం (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆమె తల్లి కాబోతోంది’’ అన్న డాక్టరు గారి సూచన రవితేజ మనసుని కలవరపెడుతోంది. ఎంత తమాయించుకుందామన్నా, సమాధానపరచుకుందామన్న - ఆరాటం ఎక్కువౌతుంది’’. ‘‘ముల్లుపై అరిటాకు పడినా, అరిటాకు ముల్లుని గుచ్చుకున్నా’’ సమస్య పరిష్కారం ఛిన్నాభిన్నం అవుతుంది. బుద్ధికి, మనస్సుకి అంతర్యుద్ధం అవుతోంది.
క్షణం ఆలోచించాడు - ఈ లోపున ఆమని రానే వచ్చింది. చాలా దూరం ప్రయాణం చేసి, చేసి, దప్పికతో అలసి పోయినట్లుంది ఆమె మోము. ‘‘ఇక పోదామా?’’ అని అడిగాడు రవి, ఆమనిని. ‘ఊ’ అన్నట్లుగా తలూపింది ఆమని. వెంటనే, కారులో నివాసం చేరారు. అప్పటికే సా॥ చేత, ఇద్దరూ ఎవరి మానాన వారు ప్లాస్క్‌లో ఉన్న ‘టీ’ పోసుకుని తాగి కొంతసేపు అయిన తర్వాత హీటరు ద్వారా కాచిన టిఫిన్ చేసి పడుకున్నారు. రవితేజ నిద్రపోతున్నాడా! లేదా నటిస్తున్నాడా? అని ఆమని గమనిస్తూ ఉంది. కానీ, ఇదేమి గమనించకుండా, తనలో తాను, ఏవేవో మాట్లాడుకుంటూ, నిదురలోకి జారుకున్నాడు రవితేజ.
ఇక ఆమని నిద్ర-కోడి కునుకే. కనురెప్ప మూసినట్టే ఉంటుంది - పది నిమిషాల్లోనే మెలకువ వచ్చేస్తుంది. ఎందుకో పూర్తిగా అర్థం కాకపోయినా, తనమీద తనకే సందేహం ఎక్కువౌతుంది.
ఈ లోపున ‘క్రింగ్ క్రింగ్’ ‘‘నా మనసే ఒక తెల్లని కాగితం ..... అది ఏనాడైనా నీకే నీకే అంకితం’’ అనే పాట, ఉత్సాహం ఉరకలు వేస్తోంది. మొబైల్’ వాయిస్ వినాలా వద్దా! భయంగా, సందేహంగా-సందిగ్ధంలో ఉంది- ఆమని ఎట్టకేలకు ధైర్యంగా బటన్ టచ్ చేసింది. అవతల నుంచి అనుకున్నట్టుగానే, ‘జంట్ వాయిస్’, కంగారు పడింది. అమాంతరం మొబైల్ తీసుకుని రూము బయటకు వచ్చి ఆరేడు నిమిషాలు మాట్లాడి, యిక ఉంటా, యూ ‘నాటీ - గుడ్‌నైట్’ అని చెప్పి ఫోను ‘స్విచ్ ఆఫ్’ చేసింది చివరి మాటలు చెవినేసుకున్నాడు - రవితేజ. ‘‘పుండుమీద కారం చల్లినట్లైంది’’ కానీ, కాలు కాలిన పిల్లిలా, అటూ ఇటూ బెడ్ మీద కదులుతూ, గంటన్నర అయిన తరువాయి నిద్రపోగలిగాడు.
అది మూడోరోజు - డాక్టర్ సలహా మేరకు - ‘రక్తంలో, హిమగ్లోబిన్ తక్కువగా ఉన్నదనే’ కారణం చేత రాసి యిచ్చిన ప్రిస్క్రిప్షన్ మేరకు టానిక్ తెప్పించి వాడుతూ వస్తోంది ఆమని. రోజులు గడుస్తున్నాయ్ - నెల అయింది. సమస్య ఉత్పాతంలా మారక మునుపే, దాన్ని సావధానంగా పరిష్కారం చెయ్యాలనే సంకల్పం రవితేజది.
‘గురువారం రాత్రి వచ్చిన ఫోను నెంబరు కనుక్కోవాలి. సంభాషణ ఏమై ఉంటుందీ తెలుసుకోవాలి - అవతలి నుంచి వచ్చిన వాయిస్ ఎవరైందీ’ అనే ఆతృత ఎక్కువైంది రవితేజకి. - ఆమని బాత్రూమ్‌కి స్నానానికి వెళ్ళింది. మొబైల్‌లో కాల్స్ ‘రీ - వైండ్’ చేశాడు. ‘క్లూ’ చిక్కింది. ప్రస్తుతానికి పేరు పెట్టని నెంబరు అదే టైముకి - ఇరువురూ, ఎవరి పక్కపై వారు నిదుర పోయిన సమయం గుర్తించారు. ఫోన్ నెంబరు బట్టి ఆచూకీ తీశాడు. క్రొత్తగా విడుదలైన సిమ్ నెంబరు కాబట్టి వివిధ షాపుల్లో విచారిస్తే ఒక చోట ఆ సిమ్ కొన్నట్లుగాను - సిమ్ తాలూకు ఆధారం - కొన్న వ్యక్తి పేరు, ఫొటో - బయోడేటా మంచి మాటలతో చేజిక్కించుకొన్నాడు.
రవి, ఆమని ముద్దుగా పెరిగిన యింట్లో అమ్మనాన్న యిద్దరూ ఉద్యోగస్తులే - ఇద్దరూ కూడా ఉ॥ 8.30 గం॥ క్యారేజ్ సర్దుకుని వారి వారి ఉద్యోగాలకు పోవాలి. ఉన్నత చదువుల పేరుతో, వీరిద్దరినీ విదేశాల్లో చదివించాలనే, కుతుహలంతో - ఖర్చెక్కువైనా, ‘్ఫరెన్’ యం.యస్, యం.బి.ఏలు చదివిస్తున్నారు. తల్లిదండ్రి దగ్గరలేకపోవడం వల్ల చెల్లి బాగోగులు చూడవలసిన బాధ్యత తనదైంది రవిది. తన యం.యస్ చదువు పూర్తి అయ్యి, నెలకు రూ.5000/- వేల డాలర్ల రుసుముతో, అప్రెంటిస్‌గా పనిచేస్తున్నాడు. చెల్లి చదువు ఈ సం॥ అయితే పూర్తి కావస్తుంది. మంచి సంబంధం చూచి పెళ్లి చేయాలి అనే ఆలోచనతో, నాలుగేళ్ల నుంచీ వేచి ఉండే సమయం, దగ్గరపడే కొద్దీ పరిస్థితి చేయి జారిపోయేట్టుంది. ఇండియా నిర్భయ చట్టం కేసు ‘డస్ట్‌బిన్’లో కాగితం. చెప్పులు అరిగేలా తిరగడం - ఆరు పదులు దగ్గరకు పడుతున్న తండ్రికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అని అనుకుంటూ రవితేజ, ఇనె్వస్టిగేషన్ మొదలు పెట్టాడు. అమ్మా ! చెల్లీ! అనునయంగా పిలిచాడు. ఏంటి అన్నా! వంట చేస్తున్నా - పోపు మాడిపోతుంది’ అని వారు అద్దెకున్న యింట్లో వంటగదిలో వంట చేస్తూ చెల్లి మాట్లాడుతోంటే’ ‘‘అవునమ్మా నీవు తొందరపడకపోతే నిజంగా మాడి మసిబొగ్గు అవుతుంది’’ అని అన్నయ్య మాట్లాడుతుంటే ఖంగుతింటుంది ఆమని’’ జరుగుతున్న విషయం విషంలా మారక మునుపే ఏదో ఒకటి తేల్చాలి అని రవితేజ’’. అన్నం చట్నీ చారు చాలులే, ఇవాళ అత్యవసరంగా డాక్టర్‌ని కలవాలి అంటూ తొందరపెట్టాడు.
ఈ లోపల ఎవరో తలుపుకొట్టినట్లైంది. తలుపు తీసేసరికి చంద్రకాంత్ ముసిముసి నవ్వులతో ప్రత్యక్షమయ్యాడు. ఆమని తత్తరపాటు చూసి ‘‘పాపా ఏంటే కంగారు పడుతున్నావు! చెయ్యి కాలిందా (లేదా) పోపు గింజలు కాలికింద పడ్డాయా!’’ అని ఒకింత గట్టిగా... అటు అరచినట్టూ ఇటు అనునయించినట్లు కాకుండా’’ రవి మాటలు విని ఉలిక్కిపడింది.
ఏమయ్యా! ఈ మధ్య నీవు కాలేజ్‌కి పోవడం లేదట! ‘‘నీ గైర్ హాజరై నిన్ను అవహేళన చేస్తుంది అని చురకవేసి, ఏం! యిలా వచ్చావు’’ అని అడిగాడు రవితేజ. ఆ వచ్చిన రవికాంత్‌తో. నీకు యిటీవల సమస్యలు ఎక్కువైనట్లు. ‘‘నెమ్మదిగా తట్టా బుట్టా సర్దేసుకుని మీ ఊరు పోరాదు’’ అని మరింత చనువుగా రెట్టించాడు. ఆ వచ్చిన అభ్యర్థికి నోటమాట రావడం లేదు. ఏదో చెప్పాలనుకున్నాడు. గొంతు పెగల్డం లేదు. అతన్ని కూర్చోబెట్టి ఉండు ఇపుడే వస్తా! అని లోపలికి వచ్చి తన దగ్గర వున్న కాగితాల్లోంచి, ఒక ఫొటోతో వున్న వివరాలను చూసి నిశే్చష్టుడయ్యాడు. ‘‘వెదకబోయినది తన కాళ్ళ దగ్గరే ఉంది’’ అని, ‘‘నిమ్మకు నీరెత్తినట్టు’’ రా భోజనానికి అని సాదరంగా అతన్ని లోపలికి పిలిచి భోజనం అయిన తర్వాత అతను వచ్చిన వివరాలు అడిగి తెల్సుకున్నాడు. కానీ నిజాలు బయటపడలేదు. ఎపుడైతే ఇలా సామరస్య పూరిత వాతావరణం ఆవరించిందో అపుడు ఆమనికి పట్టిన చెమటలు సర్దుమణిగాయి. తన చీర చెంగుతో తుడుచుకుని యింకా ఆసక్తితో తలుపు చాటునుంచి గమనిస్తూ నిలబడి వుంది. అన్నయ్య ఉగ్రుడు అవుతాడేమో! డాక్టర్ ఏం చెప్పాడు? అని తను లోలోపల కుమిలిపోతుంది. అన్నం తినలేక పోతుంది. వచ్చిన వ్యక్తితో రెండు సం॥ నుంచీ పరిచయం తనకంటే ఒక సం॥ కాలేజ్‌లో సీనియర్. మంచి మనసు కలవాడు ‘ఇండస్ట్రీయస్’ ఇంతకంటే మించి, వివరాలు తను సేకరించలేక పోయింది. కానీ ‘ఏదో తప్పిదం జరిగింది’. ఈ స్నేహం వలన అని రోజు నెలలు గడిచేకొద్దీ కడుపులో బాధ చెప్పుకోలేకపోతోంది.
అన్నయ్యకు విషయం తెలుసా.. తెలీదా? ఇదే అంతర్గత సంభాషణ.
‘సామాను సర్థడం పూర్తి అయ్యింది. నేను ఉద్యోగం మానేస్తున్నాను’. ప్రయాణానికి సిద్ధమయ్యాను’.. అని రవితేజ చెప్పేసరికి ఉలిక్కిపడింది ఆమని ‘‘ఏంటీ నన్ను వదిలేసా?’’... ‘‘ఏ! నిన్ను ఏలుకునే వాడున్నాడా? నిన్ను వదిలెయ్యటానికి?’’ అన్ని రెట్టించాడు? ‘‘్ఛ! అదేం! మాట అన్నయ్యా! ఈ 3 నెలలూ అయితే, పరీక్షలు అయిపోతాయికదా? వ్రాసే వస్తాను అంది’’ ఆమని.
అమ్మా నాకు పరీక్షాకాలం నాన్నకు రిటైర్‌మెంట్-అమ్మకా హెల్త్ బాగుండలేదు. నేను కూడా ఇండియాలోనే మెడికో ప్రాక్టీసు మొదలు పెడతాను. నీకు యిష్టమేనా? అని అడుగుతాడు. ఇష్టమే అన్నట్లు తల ఊపుతుంది. ఈ లోపున బయటకు పోయి వచ్చిన రవికాంత్ ఒక గంటలో తిరిగివచ్చి బొకెతోనూ, చిన్న చిన్న బొమ్మలతోనూ, గ్రీటింగ్స్‌తోనూ రవితేజకు ‘శుభాభినందనలు’ చెప్పడాన్కి వచ్చినట్టు వచ్చాడు. ఒక రకంగా వీడ్కోలు చెప్తున్నట్లు.
ఇంతటితో వదిలిపోయింది. పీడ విరిగి పోయినట్లుంది హాయిగా నేనొక్కడినే - వేరే ఇంకొకరి స్నేహంతో మాయమాటలతో లోబరచుకోచ్చుననే’’ లోలోపల తనకున్న ఆలోచన ఆసక్తిని ఆమని అన్నయ్య రవితేజ కనిపెట్టినట్టుగా రవికాంత్ ఊహించాడు. ఆ తెచ్చిన వస్తువులు గ్రీటింగ్‌లు బొకెలు అక్కడపెట్టి జారుకోబోతోంటే ఏయ్! ఎక్కడికి పోతావ్‌రా! ‘‘ఇదిగో నీక్కూడా ‘ఫ్లెయిట్’ టికెట్ రిజర్వు చేశా నే చెప్పినట్లు నడుచుకోకపోతే నీ చదువు సర్ట్ఫికెట్లు గల్లంతవుతాయి. మీ పెద్దలకు తెలిస్తే బాగోదు నీవు కూడా నాతో ఇండియా వస్తున్నావు. రేపు లేదు ఎల్లుండి మంగళవారం సాయంత్రం 6.00 గం॥ ప్రయాణం’ సిద్ధమై రావలసి వుంటుంది’ అని నిక్కచ్ఛిగా చెప్పాడు రవితేజ. ఒక విధంగా వార్నింగ్!
అబ్బాయి, చెల్లి మెచ్చినవాడు రవికాంత్, ఏదో మాట్లాడబోయాడు. ఈ లోపల అతను చదివే కాలేజి ప్రిన్సిపాల్ ఇంటికే వచ్చి కాగితాలు రవితేజ చేతిలో పెట్టి ‘యింక వస్తా’ సార్! అని తెలుగులో మాట్లాడి ‘కాలేజ్‌కి అప్రతిష్ట రాకుండా కాపాడారు’ అంటూ పోబోయారు. అప్పటికి గానీ, రవికాంత్‌కి పరిస్థితి అర్థం కాలేదు. ఆమనికి - రవికాంత్‌కి టి.సి.లు రెడి - మార్కుల జాబితాలు ఇతర సర్ట్ఫికెట్లు సక్రమంగా అందజేసినందుకు ప్రిన్సిపాల్‌కు కృతజ్ఞతలు చెప్పాడు రవితేజ. మిగిలిన ఫీజు ఆన్‌లైన్‌లో సర్దుబాటు చేస్తాను రామయ్య సాహేబుగారు! అని మర్యాద పూర్వకంగా వార్కి బట్టలు పెట్టి శాలువా కప్పి సత్కరించాడు. వారిని వీరి కుటుంబ సమస్యల్లో ‘ఇన్వాల్వ్’ చేయకుండా చాకచక్యంగా తప్పించాడు రవితేజ. ‘్థంక్యూ సార్’.. ప్రిన్సిపాల్, (న్యూటన్ కాలేజ్) వారి మాటలతో అందరూ ఆ రోజు తప్పుకున్నారు ఆదివారం గడిచింది.
సోమవారం రవికాంత్‌కి గడ్డు సమస్య పాస్ పోర్టు టైమ్ దాటి పోలేదు. వీసా ‘ఇన్‌వేలిడ్’ కాలేదు. కాలేజీలో ర్యాగింగ్ లేదు. ప్రేమ వివాహం రప్చర్ కాలేదు. ఏమిటీ వింత? నేను తిరుగు ప్రయాణమేమిటో? ఎలా! ఎలా! నా వివరాలు బహిర్గతమయ్యాయి? ఎలా! కాలేజ్ కోర్సు నుంచి నన్ను తప్పించగలిగారు? ఇవన్నీ అర్థంగాని విషయాల్లా మిగిలిపోయాయి. మధ్యాహ్నం 2.00 గం॥ ఆమని గుర్తుకొస్తోంది. కాలేజ్ క్యాంటిన్‌లో ఇష్టమైన ఛైనీస్ ఫుడ్, బ్రెడ్ జామ్ ఏమీలేవు. ఇపుడు అతను ఇంట్లో ఉన్నట్లు స్పృహలోకి వచ్చాడు. విధిలేని పరిస్థితుల్లో మొబైల్‌లోని గ్యాలరీ ఫోటోలను చూస్తూ బాధను లోలోపల అణుచుకుంటూ సామాను సర్థడం పూర్తి చేశాడు. ‘డేవిడ్! డేవిడ్!’ పిలిచాడు. వాడ్డూ యూ వాంట్? అని తన ‘అనెక్స్’లో ఉన్న కొలీగ్ అడిగిన ప్రశ్నకు దీనంగా సమాధానం చెప్పాడు! ‘‘ఐయామ్ లీవింగ్ ఫర్ ఇండియా టుమారో! ‘‘ప్లీజ్ పోస్ట్ మి మై లగ్‌జ్’’ బై ఇండియన్ ఎయిర్‌లైన్స్’’. ‘ఓకె మై డియర్ రవికాంత్’ యువర్స్ ఫ్రెండ్‌షిప్ ఈజ్ ఎ డ్రీమ్డ్ డెప్త్ ‘‘డేవిడ్ చెప్పిన ఆ ఆంగ్ల పదానికి రవికాంత్ ‘‘ఇట్ మే బీ సో’’. ఇది వారిద్దరి మధ్య చివరి సంభాషణ. మర్నాడు మంగళవారం - రవితేజ- ఆమని - రవికాంత్ ముగ్గురు ప్రయాణానికి సన్నద్ధమయ్యారు. ఫ్లైయిట్ ‘007’ నెం.తో ల్యాండ్ అయి ఉన్నది. అందరూ ఎక్కారు. డేవిడ్ కళ్ళు చెమ్మగిల్లాయి! ‘టా’ ‘‘బైబై’’ చెప్పడం కాక్‌పీట్ డోర్ క్లోస్ అవడం సీట్లలో బెల్ట్‌లు గట్టిగా బిగించడం కదులుతున్న విమానం ‘ఎగరక తప్పదు’ ఎక్కిన ప్రయాణికులు దూకలేరు-గట్టిగా సీటుకి అతుక్కుని ఉండలేరు. ఒకింత ఓపికుంటే, నేర్పుగా దింపబడతారు. క్షేమంగా తిరిగి స్వస్థానం చేరితే, ‘రిసీవ్’ చేసుకునే వారి ఆనందమే ఆనందం. భారతీయ సాంప్రదాయ - సాంస్కృతికాలు మరచిపోయే పాశ్చాత్య పోకడులతో సరియైన సమయంలో మేల్కొన్న రవితేజ నిజంగా ఫిల్మ్‌స్టార్! ‘మెచ్చుకోవచ్చు’. తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చగలచిన వైద్యాధికారి. సూది పొడవకుండా జ్వరం నయం చేశాడు. అదే యం.ఎస్. లక్షణం.
ఇరువైపులా, బంధువర్గాలను చేర్చి, ఏడుకొండలవాని సన్నిధిలో గట్టుచప్పుడు కాకుండా, రిజిష్టర్ మ్యారేజ్ పేరుతో, దండలు మార్పించి ఆరు నెలల తర్వాత తనే, తన అల్లుణ్ణి చేత్తో తీసుకొని ముద్దాడి మామ అవతారం ఎత్తాడు. ‘‘బావగారూ! కాంత్! గారు నీలో నాలో ఉన్న రవి - కాంతితో ఇలా మెరిసిపోతున్నాడు. చూశారా? అని అరచేతిలో ఉన్న బాలుణ్ణి చూచాడు. అందరూ కిలకిలా నవ్వారు! సుఖాంతమంటే నవ్వడమేగా!

రాయప్రోలు సి.యమ్.ఆర్.విష్ణుకుమార్. చరవాణి: 9700848283