రాజమండ్రి

కొత్త బంగారు లోకం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త బంగారు లోకం (మనోగీతికలు)

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండదు
అక్కడే ఉంటే అది తన బ్రతుకు బండిని
ఎలా ఈడుస్తుంది
పుట్టుకతోనే సంప్రాప్తించిన
విలక్షణమైన ఆకారాన్ని
మొక్కల ఆకుల అడుగు మడతలలో
పదిలంగా దాచుకొని
అందివచ్చిన ఆహారాన్ని అలాగే అందిపుచ్చుకొని
బరువుగా కాదు పరువుగా తన పయనం
కొనసాగిస్తుంది
వైకల్యాన్ని జయించాలనే
ఒకే ఒక్క ధ్యేయంతో
మార్గాన్ని అనే్వషించుకుంటూ
మునుముందుకు సాగుతుంది
అనువైన చోట తన సంకల్పానికి
కార్యదీక్ష బూనుతుంది
గుమ్మనంగా ఉంటూనే
కొత్త బంగారులోకానికి
శ్రీకారం చుడుతుంది
ఈ పరిణామ క్రమంలో
ఎన్ని దశలను దాటుతుందో అది!
ఎన్ని ఆశలకు ఊపిరిపోస్తుందో మరి!
అప్పుడే పొటమరించిన
ప్రకృతి సోయగాలతో చిందేస్తూ
పూలకనె్నలతో సావాసం చేస్తుంది
మురిపాల రెక్కలతో వాటికి
చక్కిలిగిలి పెడుతుంది

ఎన్ని రంగుల కోకలో
చిన్ని కొమ్మకు సీతకు
ఎంత హొయలో ఎంత కులుకో
రామచక్కని చిలుకకు!!!

- తటవర్తి రాఘవరావు
రామచంద్రపురం
సెల్: 9963610243

తొలి నేస్తం

కారుచీకటి నా కంట
అప్పుడే వెనె్నల జల్లుతున్న
చందమామ మా ఇంటి ముంగిట
పూల పరిమళాలు
మోసుకొస్తున్న పిల్లగాలులు
ఆరుబయట విశ్రమిస్తున్న
పల్లెవాసులు
ఎంత అందమైనదో కదా
ఆ ప్రకృతి చిత్రం!
ఆ సమయాన
నాకు వినిపించేవి
కొన్ని మధురమైన మాటలు
అవే నాన్న చెప్పే నీతికథలు
తిరిగిరాని నా బాల్యం
మరపురాని ఆ కథలు
నాకెప్పటికీ మధుర స్మృతులే!
నాన్న, నాన్న మాత్రమే కాదు
నా తొలి మిత్రుడు కూడా!
నేనానందపడితే
నాన్న మరమానందభరితుడు
నేను బాధపడితే
నాన్న ఓదారుస్తాడు
నేను భయపడితే
భుజం తట్టి ధైర్యం
చెబుతాడు
నేను వెనుకంజ వేస్తే
చేయూతనిచ్చి
ముందుకు నడిపిస్తాడు
నానే్న నా నేస్తం
తొలిసారి నాన్న గుండెలపై
తలవాల్చినపుడు తెలిసింది
నాకోసం నాన్నపడే తపన
తన హృదయ స్పందన
తెలిసిన భావన
ప్రతిధ్వనిలా నాకు
వినిపిస్తూనే ఉంటుంది
ఎప్పటికీ!

- కట్టా శ్రావణి,
చరవాణి : 9912450428

సంకెళ్లు
కంఠంలోంచి కలంలోకి ప్రయాణం
కటిక చీకటితో నా జటిల పోరాటం
వెలుతురుని వేరుచేసే విశ్వాసం
వ్యవస్థ వికటట్టహాసం
నిజంతో పనిలేని నైజం
మన నియంతృత్వం
అవిశ్రాంత యుద్ధ కాంక్ష
అనంత రక్తపిపాస
పొందేందుకు పరాజయం లేదు
పాలించేందుకు ప్రజలూ మిగల్లేదు
అయినా..
నియంతల ఇచ్చే నియంత్రించేది కాదు
సమానత్వం సర్వదా ప్రమాదమే
చరిత్రెంత ఇరుకయినా కానీండి
అందులో మనదంటూ ఒక ఈగ ఉండాలి
తప్పదు
సామ్రాజ్యాన్ని స్థాపించాలి
సమాధుల్ని పరిపాలించాలి
అప్పటిదాకా
సమాధులకి సంకెళ్లేద్దాం
సమానత్వం బయటకి రాకుండా..

- గౌరవ్, పిఠాపురం