విశాఖపట్నం

త్రిచక్ర మనస్తత్వం (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్ధరాత్రి బస్ దిగాను.
ఆటోలు ఎక్కడా కనిపించడంలేదు. సిటీబస్ స్టాప్‌కి వచ్చి నిల్చున్నాను. నాకు తెలుసు అప్పుడు బస్సులేవీ రావు. అన్నీ నిద్ర చేస్తుంటాయి. కానీ ఎక్కడయినా నించునే కన్నా ఇక్కడ నించోవడమే మంచిదని అనిపించింది. రాజేష్ అయినా ఇటువంటి సమయంలో ఇక్కడే నించుంటాడు.
చాలా సేపటికి ఒక ఆటో నేను వెళ్లవలసిన వైపుకి వస్తూ కనిపించింది.
ఎక్కడికని అడిగాడు. నేను చెప్పాను. రేటు చెప్పాడు. ఒక్కసారిగా అదిరింది జేబు. సెల్ వైబ్రేషన్ అనుకున్నాను.
కాదు అది జేబు కంపించింది గుండెతో పాటు. ‘‘షేర్ ఆటో కదా’’ అన్నాను. కాదన్నాడు. నాకేసి వెర్రివాడిని చూసినట్లు చూశాడు.
తప్పదు కనుక ఎక్కాను మరెవ్వరినీ ఎక్కించుకోకూడదన్న షరతుతో. అది నా స్వార్ధం కాదు. ప్రైవసీ అంత కంటే కాదు. ఆటోవాడి స్వార్ధానికి అడ్డుకట్ట అనుకున్నాను. వాడు ఒప్పుకున్నాడు.
ఆటో బయలుదేరి ఇరవై గజాలు వెళ్లిందో లేదో ఒకాయన ఆటో కోసం చేయి చాపాడు. ఆటో ఆగింది. ఎక్కడికి వెళుతుందో అతను చెపాపడు. ఆపినాయన అక్కడికే అనుకుంటా ఎక్కబోయాడు వెనుక సీట్లో. ఆటో అతను ముందరి సీట్లోకి అతన్ని రమ్మని చెప్పాడు. నాది కన్ఫర్మ్ అయినట్లుగాను, అతనిది ఆర్ ఎసి అయినట్లుగాను. ఆయనకి చెప్పిన రేటు మాత్రం షేర్ ఛార్జీయే. ‘‘ఎవరినీ ఎక్కించుకోనన్నావు’’ నేను ప్రశ్నించాను.
‘‘సార్ అర్ధరాత్రి కదాని ఎక్కించుకున్నాను. నాక్కూడా మరో పది రూపాయలు వస్తుంది’’ నెమ్మదిగా అన్నాడు.
నాకు రేటు చెప్పినప్పుడు ఉన్న కాఠిన్యం అతని మాటల్లో ఇప్పుడు లేదు. ‘‘సరే ఓ పని చెయ్యి. నేను దిగిపోతాను. అతన్ని మటుకు తీసుకెళ్లు. లేదా నేనిచ్చిన డబ్బునికి అతన్ని ఊరికే తీసుకెళ్లు’’ ఇప్పుడు కాఠిన్యం నా గొంతులో.
నేను దిగబోయాను.
‘‘సరేలెండి ఆయనని ఎక్కించుకోను’’ అని అతన్ని దిగమన్నాడు ఆటోవాడు.
‘‘నేను ఇస్తున్న ఛార్జీకి అతనికి ఛార్జీ వెయ్యవద్దని చెప్పాగా. ఆయనని ఊరికే తీసుకెళితే అప్పుడు నువ్వు చూపించిన జాలి నిజమవుతుంది. అతనిని, నన్నూ తీసుకెళ్లు. తరువాత నన్ను దింపెయ్. నేనింక బేరమాడకుండా ఎక్కిన డబ్బులు నీకు సరిపోతాయి’’ అని లాజిక్ చెప్పాను.
ఇక్కడైతే రాజేష్ ఏం చేస్తాడు? నాలేగా చేస్తాడు అని సర్ది చెప్పుకున్నాను. నేను చేసేవన్నీ రాజేష్ మీదకి తోసేస్తుండడం బాగా అలవాటయిపోయింది. చివరికి ఆయన స్టాప్ వచ్చింది. దిగిపోయాడు. నాకు ఆయన డబ్బులివ్వబోయాడు. తీసుకోలేదు. ‘‘మీరు వెళ్లిరండి. ఫరవాలేదు’’ అన్నాను.
రాజేష్ ఇంతలా మాట్లాడగలడా? ఏమో నేను మాట్లాడలేను. వివాదాలకి దూరంగా ఉండడమే నాకిష్టం. కానీ వాడు రాజేష్ ఊరుకోడే. ఎప్పుడూ వివాదాలే. కేవలం నాతోనే.
ఆటోల వారి ఆలోచనా విధానమేమిటో అస్సలు బోధపడదు. నేనిప్పుడు ప్రయాణించే దూరాన్ని కేవలం ఎనిమిది రూపాయలకే షేర్ ఆటో వస్తుంది పగలు అయితే. ఓరోజు నా ఒక్కడికీ మాట్లాడుకుందామని అడిగితే వంద చెప్పాడు. వద్దని షేర్ ఆటో తీసుకున్నాను. బయలుదేరింది. నా గమ్యం వచ్చే వరకూ మరెవరూ ఎక్కలేదు. అంటే ఆ ట్రిప్‌కి అతనికి కేవలొం నేనిచ్చిన ఎనిమిది రూపాయలే వచ్చాయి. కారణమేమైనా గానీ నేనూ ఒక్కడినే ప్రయాణించాను. మరి కొంచెం డబ్బులివ్వమని అతనూ అడగలేదు. నేనూ ఇవ్వలేదు. ఓ సారి గతం గుర్తుకొచ్చింది.
నేనూ గమ్యం చేరుకున్నాను. అతనికి డబ్బిచ్చాను. ముందర అతను చెప్పినంత. మాట్లాడకుండా తీసుకున్నాడు. మరో అయిదు రూపాయలిప్పించండి అడిగాడు. ఇందాకా మన అగ్రిమెంట్ ప్రకారం ఇస్తానన్నది ఇచ్చాను. నువ్వు మటుకు దానికి విలువ ఇవ్వకుండా కనీసం ఆయనని ఎక్కమని అడిగే ముందర అయినా నా అనుమతి తీసుకోలేదు. అంటే నీవేమి చేసినా ఊరుకోవాలి. నీది చాలా జాలి గుండె. నన్ను మామూలు ధర కన్నా ఇరవై రెట్లు ఎక్కువ అడిగావు. అప్పుడు నా మీద నీకు జాలి లేదు.
మధ్యలో ఒక బేరం వచ్చే సరికి నీకు జాలి కలిగింది. తక్కువ ఇచ్చే వారి మీద జాలి. ఎక్కువ ఇచ్చే వారి మీద కాఠిన్యం. అలాగే నాకూ జాలి కలిగి ఊరికే ఎక్కించుకుంటే సరేనన్నాను. మనిషికి స్వార్ధం ఉంటుంది. మరీ ఇంతలా కాదు. మొత్తం మీద పది రూపాయల బేరానికి నూట ఏభై సంపాదించినా నీకు తృప్తి కలగలేదు అర్ధరాత్రి బోధించి పంపాను. మొత్తానికి ఇంటికి చేరా గదా. ఆ అగంతకుని పది రూపాయలు ఇప్పుడు ఇచ్చెయ్యమని దెబ్బలాడతాడేమో ఆటో అతను అని రాజేష్ భయం పట్టుకుంది. వాడి మాటలు లక్ష్యపెట్టలేదు నేను. ఎందుకంటే నా పేరే రాజేష్. నాలోని నేనే రాజేష్.

- కె.వి. సుబ్రహ్మణ్యం, సింహాచలం పోస్టు, విశాఖపట్నం-530028. సెల్ : 94401 10483.