సాహితి

తొలకరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆషాఢం తొలివారం
రుతు పవనాల సౌహార్దంతో
వినువీధిలో పెను సంరంభం
మేఘ గర్జనలతో
ఉరుములు మెరుపుల విన్యాసాలు
తొలకరి పలకరిస్తుంది
చిరుజల్లుల వయ్యారాలకు
పుడమి పులకిస్తుంది
విత్తనం అంకురించి
నేల తల్లికి ప్రణమిల్లుతుంది
శ్రావణ భాద్రపదాల వర్షధారలతో
పొలాలన్నీ పచ్చదనంతో పరవశిస్తూ
వ్యవసాయం ఫలసాయమై
రైతన్న వదనం వికసిస్తుంది
పల్లెసీమలు కళకళలాడతాయి
మండుటెండలో మగ్గిన వాడికి
చిరుజల్లు చుంబనమే చందన చర్చితం
మేఘగర్జనే మహతీ నాదం
మెరిసే మెరుపులే మైమరపులు
జలమే జనావళి జీవనాధారం
వరుణుడు కరుణిస్తేనే మనిషి మనుగడ
సకాలంలో వర్షిస్తే భవిత భద్రం
భూమి బీటలువారితే బ్రతుకు ఛిద్రం

- ఇంద్రగంటి నరసింహమూర్తి